శ్రీముఖి , మనో , రాజా రవీంద్ర, భరణి కీలక పాత్రల్లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'క్రేజీ అంకుల్స్' ఆగస్ట్ 19 థియేటర్స్ లోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. కమెడియన్ ప్రవీణ్ బండ్ల గణేష్ కి సినిమా కథ చెప్పడంతో మొదలైన ట్రైలర్ ని ఫన్ ఎలిమెంట్స్ తో నింపేశారు. స్వీటి మీద మోజుతో ఆమె వెంటపడే ముగ్గురు క్రేజీ అంకుల్స్ కథతో సినిమా హిలేరియస్ గా ఉండనుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
సినిమాలో ఇండస్ట్రీ వ్యక్తులపై సరదా పంచ్ డైలాగ్స్ కూడా ఉంటాయని
ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. ట్రైలర్ లో టైటిల్ సాంగ్ , కొన్ని కామెడీ డైలాగ్స్ , ఫన్నీ
సీన్స్ , శ్రీముఖి గ్లామర్ షాట్స్ ఎట్రాక్ట్ చేశాయి. ముఖ్యంగా ముగ్గురు రావుల RRR కథ
అంటూ ప్రవీణ్ చెప్పిన డైలాగ్ తో పాటు ట్రైలర్ ఎండింగ్ లో బండ్ల గణేష్ హీరో డేట్స్ కోసం
ఎదురుచూసే నిర్మాతల గురించి, అలాగే హీరోయిన్స్ PAల గురించి చెప్పే డైలాగ్స్ కూడా నవ్వించాయి.
ట్రైలర్ చూస్తే సినిమాలో ఎంటర్టైన్ మెంట్ కి కొదవ లేదని తెలుస్తుంది.
మరి ట్రైలర్ తో మెప్పించిన దర్శకుడు E సత్తిబాబు సినిమాతో పూర్తి స్థాయిలో మెప్పిస్తాడా
? చూడాలి. డార్లింగ్ స్వామి కథ , డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు రఘు కుంచె మ్యూజిక్
కంపోజ్ చేశాడు. గుడ్ సినిమా గ్రూప్ , బొడ్డు అశోక్ నిర్మించిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో
ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/crazy-uncles-trailer-hilarious-stuff-193236/
No comments:
Post a Comment