మెగా డాటర్ నిహారిక కొణెదల భర్తపై పోలీస్ కంప్లయింట్ నమోదైంది. నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డపై బంజారాహిల్స్ పోలీసులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. కరోనా రూల్స్ అతిక్రమిస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ జనాలు చైతన్యపై పోలీసులకు కంప్లయింట్ చేశారు.
ఫిలింనగర్ కు దగ్గర్లో నిహారిక-చైతన్య ఓ ఫ్లాట్ తీసుకున్నారు.
తమ ప్రొఫెషనల్ వర్క్స్ కోసం ఆ ఫ్లాట్ ను వాడుకుంటున్నారు. అయితే రెసిడెన్షియల్ సొసైటీలో
కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారని, సొసైటీ విధించిన కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా
గుంపులు గంపులుగా ఫ్లాట్ లోకి వస్తున్నారని.. మిగతా అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు
చేశారు.
నిన్న రాత్రి అపార్ట్ మెంట్ లో కొంతమంది ఈ కంప్లయింట్ ఇవ్వగా..
తమ వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారంటూ చైతన్య కూడా అపార్ట్ మెంట్ వాసులపై
కంప్లయింట్ ఇచ్చాడు. ఇద్దరి కంప్లయింట్స్ తీసుకున్న పోలీసులు.. ఎంక్వయిరీ చేస్తున్నారు.
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/police-complaint-on-niharikas-husband-chaitanya-192850/
No comments:
Post a Comment