Thursday, August 5, 2021

Pushpa Movie Vs KGF2 Movie Yash Allu Arjun War| Zee Cinemalu Movie News Updates

ప్రస్తుతం బడా సినిమాల రిలీజ్ డేట్స్ తో టాలీవుడ్ లో హంగామా మొదలైంది. అక్టోబర్ 13న మోస్ట్ ఎవైటింగ్ RRR థియేటర్స్ లోకి రానుంది. డిసెంబర్ లో అల్లు అర్జున్ 'పుష్ప పార్ట్ 1' రిలీజ్ కానుంది. ఇక సంక్రాంతి కి పవన్ కళ్యాణ్ , మహేష్ , ప్రభాస్ సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే 'పుష్ప' డిసెంబర్ లో రానుంది కనుక ఈ సినిమాకు పోటీ లేదని అందరూ అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ 'పుష్ప'మరో పాన్ ఇండియా సినిమాతో పోటీ పడనుందని తెలుస్తుంది.

యష్ , ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ సీక్వెల్ గా రానున్న 'KGF2' కూడా డిసెంబర్ లో క్రిస్మస్ స్పెషల్ గా రానుందని సమాచారం. అయితే ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే జులై 16న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మేకర్స్ డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారని టాక్ నడుస్తుంది. RRR అక్టోబర్ లో రానుంది కాబట్టి మిగతా భాషల్లో థియేటర్స్ , మార్కెట్ పై ఓ క్లారిటీ రానుంది. దాన్ని బట్టి నవంబర్ లేదా డిసెంబర్ లో KGF2 సినిమా వచ్చే అవకాశం ఉంది.

సో బన్నీ పుష్ప , యష్ KGF2 రెండూ డిసెంబర్ లో పోటీ పడే అవకాశం ఉందనిపిస్తుంది. ఫస్ట్ టైం భారీ రేంజ్ లో అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసుకొని మిగతా భాషల్లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలు నెలకొలిపింది. ఇక KGF కి సీక్వెల్ రానున్న KGFచాప్టర్ 2 పై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు డిసెంబర్ లో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతాయా ? లేదా పుష్పరాజ్ కంటే ముందే రాకీ భాయ్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తాడా ? చూడాలి.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/pushpa-vs-kgf2-yash-allu-arjun-war-192838/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...