Monday, May 31, 2021

Another Clarity From KGF2 Team On Release Date | Zee Cinemalu Latest News Updates

KGF2 ఎనౌన్స్ చేసినట్టే జులై లో రిలీజ్ అవుతుందా ?లేదా అనే ప్రశ్న ప్రస్తుతం సినిమా అభిమానుల్లో ఉంది. అయితే ఎప్పటికప్పుడు అదే డేట్ చెప్తూ క్లారిటీ ఇస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం మేకర్స్ సినిమాలో నటించిన నటుల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి స్టిల్ తో KGF TIMES అంటూ పేపర్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ , రావు రమేష్ లకు విషెస్ చెప్పిన KGF2 టీం తాజాగా నటుడు బాలకృష్ణ నీలకంఠపురం ని విష్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

సినిమాలో బాలకృష్ణ నీలకంఠపురం ఖలీల్ అనే పాత్ర చేస్తున్నట్లు తెలియజేస్తూ అతని క్యారెక్టర్ గురించి హింట్ ఇచ్చేలా పోస్టర్ వదిలారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ విషెస్ పోస్టర్స్ లో జులై16న విడుదల అంటూ చెప్పిన మేకర్స్ తాజాగా బాలకృష్ణ విషెస్ పోస్టర్ మీద కూడా అదే డేట్ కి రిలీజ్ అంటూ ఉంచేశారు. దీంతో సినిమా జులైలో థియేటర్స్ లోకి రావడం పక్కా అనే ప్రశాంత్ అండ్ టీం మరోసారి ప్రకటించినట్లుగా భావిస్తున్నారు సినిమా లవర్స్.

ప్రస్తుతం కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో థియేటర్స్ మూత పడటం, సినిమాలు వాయిదా పడటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో KGF Chapter2 కూడా పోస్ట్ పోన్ అవుతుందని అనుకున్నారు ఆడియన్స్. కానీ మేకర్స్ మాత్రం ఇంకా అదే డేట్ కి స్టిక్ అయి ఉన్నారని తెలుస్తుంది. అందుకే జులై రిలీజ్ అంటూ పోస్టర్స్ మీద చెప్తూ వస్తున్నారు. అంటే సినిమా విడుదలకి సరిగ్గా నెలన్నర మాత్రమే ఉంది. మరి ఈ లోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసిన థియేటర్స్ ఇప్పట్లో తెరిచే వీలు కనిపించడం లేదు. ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మిగతా స్టేట్స్ లో పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఓ రెండు నెలల పాటు థియేటర్స్ తెరిచే పరిస్థితి లేదు. మరి ఇదంతా ఆలోచించి మేకర్స్ త్వరలోనే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారేమో చూడాలి. యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ , ప్రకాష్ రాజ్ , రవీనా టాండన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/another-clarity-from-kgf2-team-on-release-date-190235/


No Hungama from Mahesh on Krishna Birthday| Zee Cinemalu Tollywood Updates

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ రోజు మహేష్ బాబు నుండి రెండు సినిమాల అప్ డేట్స్ రావాలి. అందులో ఒకటి సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ కాగా , మరొకటి మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్. అవును ఈ రెండు సినిమాల నుండి ఫస్ట్ లుక్ , టైటిల్ ఎనౌన్స్ చేసి మహేష్ ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని భావించారు. నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వీటితో ఫ్యాన్స్ ని సంతోష పెట్టాలనుకున్నాడు మహేష్. కానీ పరిస్థితులు బాగోకపోవడంతో ప్లాన్ మార్చుకొని రెండు అప్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా మహేష్ అభిమానులకు ఈ విషయాన్ని తెలియపరిచారు.

నిజానికి తన తండ్రి పుట్టిన రోజు అయిన మే 31న తన సినిమాలకు సంబంధించి ఇదొకటి విడుదల చేసి తనని స్టార్ చేసిన కృష్ణ గారికి విషెస్ చెప్తుంటాడు మహేష్. ఒక రకంగా అది మహేష్ కి సెంటిమెంట్ అని చెప్పొచ్చు. కానీ కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ఈసారి మహేష్ తన సినిమాల అప్డేట్స్ రిలీజ్ వద్దని నిర్ణయించుకొని మేకర్స్ తో విషయం చెప్పాడు. అందుకే మహేష్ నిర్ణయం మేరకూ అప్ డేట్స్ ని వాయిదా వేశారు దర్శక నిర్మాతలు.

ఏదేమైనా మహేష్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవ్వాల్సిన మహేశ్ ఫ్యాన్స్ మహేష్ అండ్ టీం తీసుకున్న ఈ నిర్ణయంతో కొంత నిరాశ చెందారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ అభిమాన హీరో తీసుకున్న నిర్ణయం మంచిదని భావిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాట కి సంబంధించి మొదటి షెడ్యుల్ పూర్తయింది. లాక్ డౌన్ అనంతరం షూటింగ్ పర్మీషణ్ రాగానే రెండో షెడ్యుల్ మొదలు పెట్టనున్నారు. ఇక మహేష్ -త్రివిక్రమ్ కాంబో సినిమా జులై లేదా ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాకు త్రివిక్రమ్ ఎలాంటి టైటిల్ పెడతాడా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/no-hungama-from-mahesh-on-krishna-birthday-190238/

Saturday, May 29, 2021

Kalyan Ram As Bimbisara First Look Unveiled | Zee Cinemalu Tollywood Updates

 Daring and dynamic hero Nandamuri Kalyan Ram’s 18th film title and first glimpse are unveiled. Produced by Hari Krishna K under NTR Arts banner, the film is titled ‘Bimbisara’ and comes up with the tagline ‘A Time Travel From Evil To Good.’

Mallidi Vashist is directing ‘Bimbisara’ and on the occasion of NTR’s birth anniversary the announcements were made. The first look glimpse shows Kalyan Ram in a never before avatar.

Right from the beginning of his career, Kalyan Ram has thrived for different roles and yet again he makes a point to prove it that he is game for diverse content. Seen as a barbaric king, Kalyan Ram holds a sword that has blood stains and is seated above a pool of dead bodies.

Kalyan Ram’s look and the backdrop with vfx are just terrific. “We have started the shooting of the film last year. We are making the film with high technical values and involves a lot of graphic works. Huge sets were erected for this film and it is going to be a bid budget film in Kalyan Ram’s career. Currently the shooting is stalled due to the Covid-19 and once things normalise, the works resume. We are planning to release the movie in second half of this year,” said the ‘Bimbisara’ team.

Catherine Tresa and Samyuktha Menon are playing the female lead roles.

Cast: Nandamuri Kalyan Ram, Catherine Tresa, Samyuktha Menon

Crew:

Director: Mallidi Vashist

Producer: Hari Krishna K

Banner: NTR Arts

Cinematography: Chota K Naidu

Editor: Tammiraju

Music: Chirantan Bhatt

Lyrics: Sirivennela Seetarama Sastry, Ramajogayya Sastry

Art Director: Kiran Kumar Manne

Choreography: Shobi, Raghu

Fights: Venkat, Ramakrishna

VFX: Anil Paduri.

 

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/kalyan-ram-as-bimbisara-first-look-unveiled-190100/


Chiranjeevi demands Bharata Ratna for NTR | Zee Cinemalu News Updates

తెలుగు జాతి గౌరవం , విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహానుభావుడిని తలుచుకుంటూ స్టార్స్ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. ఉదయం నుండే ట్విట్టర్ లో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఉదయం నందమూరి బాలకృష్ణ కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర తన తండ్రికి నివాళులు అర్పించారు. ఇప్పటికే పలు సార్లు ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకున్న మెగా స్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ పై తనకున్న గౌరవాన్ని , ప్రేమను మరో సారి ట్విట్టర్ వేదికగా చాటుకున్నారు.

జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని మెగా స్టార్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ప్రముఖ గాయకుడు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ నమస్కారం" అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు చిరు.

ఎన్టీఆర్ గురించి మెగా స్టార్ పెట్టిన ఈ ట్వీట్ చూసి తెలుగుదేశం నాయకులు , నందమూరి అభిమానులు చిరుకి ధన్యవాదాలు చెప్తూ త్వరలోనే ఎన్టీఆర్ గారికి ఆ గౌరవం దక్కాలని కోరుకుంటున్నాం అంటూ రిప్లై ఇస్తున్నారు. కొన్నేళ్ళుగా ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులు, అభిమానులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి మన తారక రాముడికి ఆ అరుదైన గౌరవం తొందర్లోనే దక్కాలని కోరుకుందాం.

 

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/chiranjeevi-demands-bharata-ratna-for-ntr-190094/

Wednesday, May 26, 2021

Chiranjeevi Oxygen Banks Starts all over Telugu states| Zee Cinemalu News Updates

క‌రోనా క్రైసిస్ చారిటీ సేవ‌ల అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల ఏర్పాటు ప్ర‌క్రియ పూర్త‌యింది. వారంలోగా ఈ ఏర్పాటు చేస్తామ‌ని మెగాస్టార్ ప్ర‌క‌టించిన‌ట్టే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

అభిమాన సంఘాల అధ్య‌క్షుల ఆధ్వ‌ర్యంలో ఈ ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఈరోజు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జ‌రిగింది. అనంత‌పూర్, గుంటూరు, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్నం, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌కు బుధ‌వారం సాయంత్రానికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి.

బ్ల‌డ్ బ్యాంక్ నుంచి ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు.. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్స‌ంట్రేట‌ర్లు పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఈరోజు బుధవారం నాడు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాల్లో ఆస్ప‌త్రి నుంచి ఆక్సిజ‌న్ కావాల‌ని కోర‌గానే సిలిండ‌ర్ల‌ను పంపిస్తారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ పంపిణీ ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు చిరంజీవి. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ -``చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంత‌రాయంగా ఆక్సిజ‌న్ పంపిణీ కొనసాగుతుంది. ఇక్క‌డ స్కార్సిటీ వ‌ల్ల చైనా నుంచి ఆక్సిజ‌న్ కాన్ స‌న్ ట్రేట‌ర్లు ఆర్డ‌ర్ చేశాం. ప్ర‌స్తుతం చాలా చోట్ల వీటి కొరత నెల‌కొంది. అత్యవసరంగా ఎక్క‌డ అవ‌స‌రం ఉంది అనేది తెలుసుకొని ఆక్సిజ‌న్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్ని జిల్లాల‌కు అవ‌స‌రం ఉన్న అన్నిచోట్ల‌కు పంపిణీ చేస్తాం. అలాగే ప్ర‌తిచోటా ఆక్సిజ‌న్ సిలిండర్లు ఎక్కడెక్కడ ఏ టైంలో చేరుకుంటున్నాయి అనేది ట్రాకింగ్ ప‌రిక‌రాన్ని కూడా టెక్నీషియ‌న్లు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుంది. అన్నిచోట్లా ఇది స‌ద్వినియోగం కావాల‌నే మా ప్ర‌య‌త్నం. రామ్ చ‌ర‌ణ్ ఈ ఏర్పాట్ల‌న్నీ చూస్తున్నారు`` అని అన్నారు.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/chiranjeevi-oxygen-banks-starts-all-over-telugu-states-190022/

Wednesday, May 19, 2021

Balakrishna Trisha Combination On Cards | Zee Cinemalu Latest News Updates

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో 'బాలయ్య 'అఖండ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ఇంకా ఫైనల్ షెడ్యుల్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా తర్వాత గోపి చంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. ఆ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కరోన ప్రభావం తగ్గి షూటింగ్స్ మొదలవ్వగానే ఈ ఈ కాంబో సినిమా సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్స్ కి కాస్టింగ్ ని ఫైన చేసిన పనిలో ఉన్నాడు గోపీచంద్.

సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా త్రిష ని ఫైనల్ చేసుకున్నారని తెలుస్తుంది. మొన్నటివరకు ఈ ప్లేస్ లో శృతి హాసన్ ని అనుకున్నారు. క్రాక్ సెంటిమెంట్ తో మళ్ళీ శృతి రిపీట్ చేయాలనుకున్నాడు దర్శకుడు కానీ శృతి ప్రస్తుతం ప్రభాస్ 'సలార్' సినిమా చేస్తుంది. ఆ సినిమాకు బల్క్ డేట్స్ ఇచ్చేసింది. అందుకే ఇప్పుడు శృతి హాసన్ ప్లేస్ లో త్రిషని తీసుకోనున్నారని సమాచారం.

బాలయ్య -త్రిష కాంబినేషన్ లో ఆరేళ్ళ క్రితం 'లయన్' అనే సినిమా వచ్చింది. సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. పైగా తెలుగులో త్రిష కి క్రేజ్ కూడా ఉంది. అందుకే కొందరు సీనియర్ హీరోయిన్స్ ని లిస్టు అవుట్ చేసి ఫైనల్ త్రిష ని ఎంచుకున్నారట. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/balakrishna-trisha-combination-on-cards-189555/

Tuesday, May 18, 2021

Allu Aravind Responds On OTT Movies| Zee Cinemalu Latest News Updates

ప్రస్తుతం OTT లకి ప్రేక్షకులు మెల్లమెల్లగా అలవాటు పడుతున్నారు. ఇక కొన్ని సినిమాలు కేవలం OTT కోసమే తీస్తుండటం కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సిన సినిమాలు కూడా OTT బాట పడుతున్నాయి. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థతో పాటు ఎగ్జిబ్యూటర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇకపై బడా సినిమాలు కూడా డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లోనే రిలీజ్ అయితే తమ పరిస్థితేంటి ? అంటూ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఈ విషయంపై తాజాగా బడా నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. సినిమాల OTT రిలీజ్ గురించి ఇటివలే ఆయనకీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురైంది. అగ్ర నిర్మాతగా మీరు థియేటర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా ? లేదా OTT కి ఇంపార్టెన్స్ ఇస్తారా ? అనే ప్రశ్న కి సమాధానం చెప్తూ తను ఎప్పుడూ థియేటర్స్ కే ఓటు వేస్తానని తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సినిమాలు OTT కోసం తీస్తున్న మాట నిజమే అని అలా డిజిటల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన సినిమా కచ్చితంగా OTT లోనే రిలీజ్ చేయాలని అలాగే థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం తీసిన సినిమా అయితే వెయిట్ చేసి సినిమా హాల్స్ లోనే విడుదల చేసుకోవాలని ఆయన అన్నారు.

ఇక కొందరు నిర్మాతలు థియేటర్ కోసం తీసిన సినిమాను డైరెక్ట్ గా ఓ టి టి లో రిలీజ్ చేస్తుండటంపై కూడా అల్లు అరవింద్ మాట్లాడారు. కొందరు నిర్మాతలు వారికి ఉన్న ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల సినిమాలను డైరెక్ట్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదల చేస్తున్నారని అది వారి వ్యక్తిగత విషయమని చెప్పారు. సో అగ్ర నిర్మాత ఫైనల్ గా థియేటర్స్ కే ఓటు వేసి OTT కోసం తీసిన సినిమాలు, అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్న సినిమాలు మాత్రమే ఓ టి టి లో విడుదలవుతాయని వ్యక్తం చేశారు.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/allu-aravind-responds-on-ott-movies-189516/

NTR Birthday Special – More Surprises To Come| Zee Cinemalu News Updates

మరో 2 రోజుల్లో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి ఈ బర్త్ డేకిఎన్టీఆర్ నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ ఉండబోతోంది. ప్రస్తుతానికైతే దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. కానీ కచ్చితంగా ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ నుంచి సర్ ప్రైజెస్ అయితే మాత్రం ఉన్నాయి.

RRR రాజమౌళి దర్శకత్వంలో RRR Movie చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు, ఎన్టీఆర్ టీజర్ కూడా రిలీజైంది. ఈ పుట్టినరోజుకు కూడా RRR Movie నుంచి సర్ ప్రైజ్ ఉంది. ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు 3 పోస్టర్ల నుంచి ఓ లుక్ ను రాజమౌళి లాక్ చేశాడు. ఆ ట్రెండింగ్ రేపట్నుంచి మొదలుకాబోతోంది.

ఎన్టీఆర్-మైత్రీ మూవీ మేకర్స్ NTR పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కూడా ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యానర్ పై ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఇద్దరు రెడీగా ఉన్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఆల్రెడీ లాక్ అయింది. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్టు ఉందని ప్రకటించాడు. ఇక ఇదే బ్యానర్ పై ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కూడా ఓ సినిమా ఉంది. అది ఎన్టీఆర్ తోనే అని టాక్. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అఫీషియల్ ప్రకటన వస్తుందో చూడాలి.

ఎన్టీఆర్-కొరటాల సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదే. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి తారక్ బర్త్ డేకి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి. సినిమాకు సంబంధించి టైటిల్ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. లేకపోతే, హీరోయిన్ ఎవరనే విషయాన్ని కూడా అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది.

వీటికి సంబంధించి 20వ తేదీన ఏదో ఒక హంగామా ఉండే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే, కరోనా బారిన పడిన తారక్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అందుకే ఈ పుట్టినరోజుకు ఎవ్వరికీ అందుబాటులో ఉండడం లేదు యంగ్ టైగర్.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/ntr-birthday-special-more-surprises-to-come-189521/

Rajamouli May Follow Bahubali Sentiment For RRR Release | Zee Cinemalu News Updates

ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలన్నీ విడుదల వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి కన్ను RRR పై పడింది. సినిమాను అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ఆ రిలీజ్ డేట్ ని మేకర్స్ అందుకోవడం కష్టమే అనిపిస్తుంది. సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పైగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. అందుకే మేకర్స్ మరోసారి సినిమా విడుదల వాయిదా వేసి మరో డేట్ సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తుంది.

అసలు అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సంక్రాంతికి సినిమా థియేటర్స్ లోకి రావలసి ఉంది. కానీ కరోన ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడు దసరా బరిలో నిలిచింది. ఇక దసరా మిస్ అయితే మేకర్స్ చేతిలో ఉన్న మరో మంచి డేట్ వచ్చే ఏడాది సంక్రాంతి. కానీ 2022 సంక్రాంతి కి ఇప్పటికే మహేష్ 'సర్కారువారి పాట', పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాలు ఎనౌన్స్ అయ్యాయి. అందుకే జక్కన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వినబడుతుంది.

ఇక ఇండస్ట్రీ లో కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. జక్కన్న కూడా అలాంటి సెంటిమెంట్ ని ఫాలో అవుతూ RRR ని 'బాహుబలి' రిలీజయిన ఏప్రిల్ నెలలో అదే తేదికి రిలీజ్ చేస్తాడని అంటున్నారు. మరి జక్కన్న ఈ సెంటిమెంట్ ని నిజంగా ఫాలో అవుతాడా ? RRR ఈ ఏడాది రానట్టేనా? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/rajamouli-may-follow-bahubali-sentiment-for-rrr-release-189531/

Monday, May 17, 2021

Prabhas Wants To Give First Priority To Adipurush | Zee Cinemalu News Updates

ప్రభాస్ కు సంబంధించి ప్రస్తుతం సెట్స్ పై 2 సినిమాలున్నాయి. ఓకే చేసిన సినిమా ఒకటి ఉంది. ఇంకో సినిమా ఎనౌన్స్ మెంట్ స్టేజ్ లో ఉంది. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ.. ప్రభాస్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఒకే ఒక్క సినిమా. అదే ఆదిపురుష్.

అవును.. ఆదిపురుష్ ప్రాజెక్టును పూర్తిచేసిన తర్వాతే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లాలని ప్రభాస్ తాజాగా నిర్ణయించుకున్నాడు. ఓవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా సెట్స్ పై ఉన్నప్పటికీ, ఆదిపురుష్ కంప్లీట్ అయిన తర్వాతే సలార్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఓ రీజన్ ఉంది. ఆదిపురుష్ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ. షూటింగ్ పూర్తయిన తర్వాత గ్రాఫిక్స్ కోసమే కనీసం 6 నెలల టైమ్ పడుతుంది. సో.. వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తిచేయాలి. అందుకే ప్రభాస్ ఆదిపురుష్ కే తొలి ప్రాధాన్యం ఇచ్చాడు.

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఇంకా 90 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. లెక్కప్రకారం, ఈపాటికి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభం కావాలి. కానీ తెలంగాణలో లాక్ డౌన్ వల్ల షూటింగ్ నిలిచిపోయింది. ఎప్పుడు షూటింగ్స్ ప్రారంభమైతే అప్పుడు ఆదిపురుష్ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు ప్రభాస్.

ఈ మూవీలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్, కృతిసనన్ కు కూడా ఇతర బాలీవుడ్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. వీలైనంత తొందరగా ఆదిపురుష్ ను పూర్తిచేయాలని వాళ్లు భావిస్తున్నారు. అందుకే కరోనా టైమ్ లో కూడా షూటింగ్ కు వచ్చేందుకు వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ బ్యాడ్ లక్. లాక్ డౌన్ పడి షూటింగ్స్ ఆగిపోయాయి.

ఆదిపురుష్ పూర్తిచేసిన తర్వాత సలార్ సినిమాను కంటిన్యూ చేస్తాడు ప్రభాస్. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఈ గ్యాప్ లో మరో మూవీని అఫీషియల్ గా ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు. అయితే అది యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై చేయబోయే స్ట్రయిట్ బాలీవుడ్ సినిమానా లేక సుధా కొంగర దర్శకత్వంలో చేయబోయే మూవీనా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కూడా షూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పటికీ అది లెక్కలోకి రాదు. ఎందుకంటే, దానికి సంబంధించి కేవలం 4 రోజుల షూట్ మాత్రమే పెండింగ్ ఉంది.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/prabhas-wants-to-give-first-priority-to-adipurush-189422/

Friday, May 14, 2021

Battala Ramaswamy Biopikku Movie Review By Zee Cinemalu |Latest Tollywood News

నటీనటులు - అల్తాఫ్ హాసన్, శాంతిరావు, సాత్విక, లావణ్య రెడ్డి, భద్రం తదితరులు బ్యానర్ - సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సమర్పణ - మ్యాంగో మాస్ మీడియా నిర్మాతలు - సతీశ్ కుమార్, రామకృష్ణ వీరపనేని కథ - రామ్ నారాయణ్, వాసుదేవ మూర్తి డైలాగ్స్, లిరిక్స్ - వాసుదేవ్ మూర్తి డీవోపీ - పీఎస్కే మణి ఎడిటింగ్ - సాగర్ స్క్రీన్ ప్లే, మ్యూజిక్, దర్శకత్వం - రామ్ నారాయణ్ సెన్సార్ - U/A రన్ టైమ్ - 2 గంటల 16 నిమిషాలు రిలీజ్ డేట్ - మే 14, 2021 వేదిక - జీ5

కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చింది బట్టల రామస్వామి బయోపిక్. ట్రయిలర్ తో ఆకట్టుకున్న సినిమా, ఈరోజు జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి మూవీ ఎలా ఉంది? రామస్వామి కథేంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

 

కథ

పుట్టడంతోనే కృష్ణుడి పోలికలతో పుడతాడు రామస్వామి. కానీ అతడికి రాముడు మంచి బాలుడు అనే టైపులో ఉండాలని కోరిక. చిన్నప్పట్నుంచి రామస్వామికి చీరలంటే ఇష్టం. ఇష్టంతోనే చీరల వ్యాపారం చేయాలనుకుంటాడు. క్రమంలోనే జయప్రదను చూసి ఇష్టపడతాడు. అమె సహాయంతో చీరల వ్యాపారం కూడా ప్రారంభిస్తాడు. అయితే అనుకోని విధంగా జయప్రద చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మరో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇలా 3 పెళ్లిళ్లు చేసుకున్న రామస్వామి.. ఒకే ఇంట్లో ముగ్గురితో కలిసి ఎలా కాపురం చేశాడు, అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అనేది సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు

రామస్వామి పాత్ర పోషించిన అల్తాఫ్ హసన్ సరిగ్గా సరిపోయాడు. మిడిల్ క్లాస్ వ్యక్తిగా అతడి లుక్, గెటప్ సరిపోయింది. మరీ ముఖ్యంగా తన చూపులతోనే సగం నటించేసి సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఇక రామస్వామి మొదటి భార్యగా నటించిన శాంతిరావు.. మిగతా ఇద్దరు భార్యలుగా సాత్విక, లావణ్య రెడ్డి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరో స్నేహితుడిగా భద్రంకు మంచి పాత్ర పడింది. ఇతర నటీనటులంతా తమ పాత్రల మేరకు పెర్ ఫెక్ట్ గా నటించారు. ఇంటి ముందు కూర్చొని రోడ్డున పోయే ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ ''అట్టానా'' అంటూ కామెడీ పండించే పెద్దావిడ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిందే.

 

టెక్నీషియన్స్ పనితీరు

ముందుగా దర్శకుడు రామ్ నారాయణ్ గురించే చెప్పుకోవాలి. సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, సంగీతం విభాగాల్ని కూడా ఇతడే చూసుకున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వం బాగుంది. పల్లె వాతావరణం, నేటివిటీని తీసుకురావడంతో ఇతడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఎక్కడా ఎంటర్ టైన్ మెంట్ తగ్గకుండా వాసుదేవ్ మూర్తితో కలిసి స్టోరీ రాసుకున్న విధానం బాగుంది. ఇక మ్యూజిక్ డైరక్టర్ గా కూడా బాగానే మెరిశాడు రామ్ నారాయణ్. అందానికే అందానివే అనే పాట వినసొంపుగా ఉంది. కథ, సన్నివేశాలకు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్ డిజైనింగ్ అన్నీ కథకు తగ్గట్టు కుదిరాయి. కథపై పూర్తి నమ్మకంతో దిగిన నిర్మాతలు ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా మెప్పించవు. పల్లె వాతావరణంలో తీసినప్పటికీ ఇంకాస్త రిచ్ గా సినిమా తీసి ఉండొచ్చు.

 

జీ సినిమాలు రివ్యూ

ఒకప్పట్లా పెద్ద హీరో దొరికాడా లేదా... మంచి టెక్నికల్ సపోర్ట్ ఉందా లేదా అని చూసే రోజులు పోయాయి. ఇప్పుడు కావాల్సింది ఒకే ఒక్కటి. చేతిలో మంచి కంటెంట్ ఉందా లేదా? ఇది ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈరోజు ZEE5లో ఎక్స్ క్లూజివ్ గా రిలీజైన బట్టల రామస్వామి బయోపిక్కు అనే సినిమా ఇలాంటిదే. ఇందులో నటీనటులెవ్వరు అనే ఆరాలు అనవసరం. డైరక్టర్ ఇంతకుముందు ఏం తీశాడు అనే లెక్కలు అక్కర్లేదు. జస్ట్ సినిమా స్టార్ట్ చేసిన 10 నిమిషాలకే కనెక్ట్ అయిపోతాం. చివరివరకు విడిచిపెట్టం. బట్టల రామస్వామి బయోపిక్కు ఎలా ఉందో చెప్పడానికి ఇంతకుమించిన ఎనాలసిస్ అక్కర్లేదు.

సాధారణ వ్యక్తి జీవితంలో ఇన్ని ట్విస్టులు ఉంటాయా..? దిగువ మధ్యతరగతి వ్యక్తికి కూడా బయోపిక్ ఉంటుందా? ఇవి సినిమాలో డైలాగులే. శుభం కార్డు పడిన తర్వాత మనకు కూడా ఇలానే అనిపిస్తుంది. భలేగా తీశారే అనే ఆశ్చర్యం కలుగుతుంది. సరిగ్గా ఇక్కడే రామస్వామి సక్సెస్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే సినిమా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. ఆఖర్లో చిన్న తృప్తిని మిగులుస్తుంది.

రొమాంటిక్ కామెడీలు చాలానే వచ్చాయి. కానీ అన్నీ సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నవే. హీరోను ఉమెనైజర్ గా చూపించినవే. కొన్ని సినిమాల్లో ఏమీ లేకపోయినా వాటికి రొమాంటిక్ కామెడీ అనే ట్యాగ్ లైన్ తగిలించి మార్కెట్ చేసిన సందర్భాలు చూశాం. కానీ అసలుసిసలు రొమాంటిక్ కామెడీ అంటే ఎలా ఉంటుందో బట్టల రామస్వామి బయోపిక్ చూస్తే అర్థమౌతుంది. ఇందులో రొమాన్స్ ఉంది కానీ కళ్లకు కనిపించదు. కామెడీ కూడా ఉంది, కానీ కావాలని పెట్టినట్టు అనిపించదు. అదే సినిమాలో ''మ్మత్తు''.

చిన్న స్కూటీపై ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునే రామస్వామి జీవితాన్ని పుట్టుక నుంచి కళ్లకుకట్టి చూపించింది సినిమా. శవంతోనే సినిమా స్టార్ట్ చేసి, అదే శవం చుట్టూ కామెడీ పండించిన దర్శకుడి చమత్కారాన్ని, అతడి స్క్రీన్ ప్లే టెక్నిక్ ను మెచ్చుకోకుండా ఉండలేం. రాముడిలా సింగిల్ వైఫ్ తో సెటిల్ అవ్వాలనుకున్న రామస్వామి, కృష్ణుడి టైపులో ముగ్గురు భార్యలను ఎందుకు మెయింటైన్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఎంత సరదాగా చూపించాలో అంతే సరదాగా, సరసంగా చూపించాడు డైరక్టర్.

బూతు అనిపించే విషయాల్ని కూడా కామెడీలో కలిపేసి, డైలాగ్స్ తో మాయచేశాడు. ఎక్కడా ఎబ్బెట్టు అనిపించకుండా ఇలాంటి సినిమాను తీయడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. రామస్వామికే కాకుండా.. ప్రతి భార్యకు బ్యాక్ డ్రాప్ ఇచ్చి అందర్నీ కథలోకి తీసుకొచ్చిన విధానం బాగుంది. మరీ ముఖ్యంగా మూడో భార్యను రామస్వామి కట్టుకున్న విధానం, పెళ్లి తంతు, శోభనం ముచ్చట్లు లాంటి సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు.

కరోనా న్యూస్ చూస్తూ, కరోనా కష్టాలు వింటూ, బుర్రలో కరోనా భయాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న రోజుల్లో కాస్త రిలీఫ్ అందిస్తాడు మన రామస్వామి.

బాటమ్ లైన్ - రామస్వామి రొమాన్స్ రేటింగ్ - 2.75/5

 

Read more: http://www.zeecinemalu.com/en/movie-review/battala-ramaswamy-biopikku-movie-telugu-review-by-zeecinemalu-189323/

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...