Tuesday, June 29, 2021

Allari Naresh New Movie Announcement Tomorrow | Zee Cinemalu Latest News

జూన్ 30.. అంటే రేపు అల్లరినరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లరోడి నుంచి మరో మువీ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. కెరీర్ లో అల్లరినరేష్ కు ఇది 58వ సినిమా. ఎలాంటి డీటెయిల్స్ రివీల్ చేయకుండా కేవలం ఎనౌన్స్ మెంట్ పోస్టర్ మాత్రమే ఇచ్చారు. అందులో విమానం ల్యాండ్ అవుతున్నట్టు చూపించారు. రేపు ఉదయం 10 గంటలకు ఎనౌన్స్ మెంట్ వచ్చేవరకు ఈ సస్పెన్స్ తప్పదు.

మహర్షి నుంచి రూటు మార్చాడు అల్లరోడు. కామెడీ సినిమాలు చేస్తూనే, కాస్త డెప్త్ ఉన్న సీరియస్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. తనను సీరియస్ రోల్స్ లో కూడా ఆదరిస్తారని మహర్షి సినిమాతో తెలుసుకున్న అల్లరి నరేష్.. నాంది సినిమాతో తన నమ్మకం నిజమైందనే నిర్థారణకు వచ్చాడు.

పూర్తిగా సీరియస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది నాంది. ఇందులో అల్లరి నరేష్ అండర్ ట్రయల్ ఖైదీగా నటించాడు. సినిమాలో ఎక్కడా ఓ కామెడీ సీన్ ఉండదు. పక్కా సీరియస్ మూవీ. ఇన్నాళ్లూ కామెడీ హీరో అనిపించుకున్న అల్లరినరేష్, ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ తో కూడా హిట్ కొట్టగలడని నిరూపించింది నాంది. అంతేకాదు.. కామెడీ చేసినోడు ఏదైనా చేయగలడనే నమ్మకాన్ని నాంది నిజం చేసింది.

అలా విభిన్న కథలు, డిఫరెంట్ మూవీస్ సెలక్ట్ చేసుకుంటున్న అల్లరి నరేశ్.. ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నాడే ఆసక్తి అందర్లో ఉంది. అందుకే #NARESH58పై అందరి చూపు పడింది. ఈ సస్పెన్స్ కు రేపు ఉదయం 10 గంటలతో తెరపడబోతోంది.

Read More: http://www.zeecinemalu.com/news-gossip/allari-naresh-new-movie-announcement-tomorrow-191546/

Telugu Movies May Release From August| Zee Cinemalu Latest News

 ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి మెల్ల మెల్లగా చక్కబడుతుంది. షూటింగ్స్ మొదలు పెడుతుండటంతో సినీ కార్మికులకు నటీ నటులకు మళ్ళీ పని దొరుకుతుంది. ఇక థియేటర్స్ తెరవడం అందులో సినిమా వేయడమే తరువాత కార్యక్రమం. అయితే ఇది జరగడానికి ఇంకా ఓ నేలపైనే పట్టొచ్చు. తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్స్ ఓపెన్ కి పర్మీషణ్ ఇచ్చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ నైట్ కర్ఫ్యూ ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో కూడా లాక్ డౌన్ సడలింపు జరిగితే ఇక నిర్మాతలు తమ సినిమాల ఎనౌన్స్ మెంట్ ముందుకొస్తారు. ఇప్పటికే 'SR కళ్యాణమండపం' , 'ఇష్క్' లాంటి చిన్న సినిమాలతో పాటు నాని 'టక్ జగదీశ్' , నాగ చైతన్య 'లవ్ స్టోరి' , 'రానా విరాటపర్వం' సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. అంతా సెట్ అవ్వగానే ఇవన్నీ ఒక్కో వారం థియేటర్స్ లోకి వస్తాయి.

ఇక అన్నిటికంటే ముందుగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'SR కళ్యాణ మండపం' సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ మొదటి వారంలో సినిమా రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఆగస్ట్ లో ఈ సినిమా నుండి వరుసగా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి జులై నెల దాటితే ఆగస్ట్ నుండి సినిమా లవర్స్ కి ఇక పండగే. మరి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత ఈ సినిమాలకు ప్రేక్షకుల నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.

అటు పెద్ద సినిమాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆచార్య, అఖండ, రాధేశ్యామ్ సినిమాల రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేయలేదు. ఒకటి దీపావళి, ఇంకోటి దసరా, మరొకటి క్రిస్మస్ అంటూ గాసిప్స్ మాత్రమే వస్తున్నాయి తప్ప, యూనిట్ నుంచి దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా.. ఆగస్ట్ నుంచి పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకున్న తర్వాత అప్పుడు వీటిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/telugu-movies-may-release-from-august-191539/

RRR Shooting Completed Except 2 Songs | Zee Cinemalu Latest News

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ #RRR కి సంబంధించి చాలా ప్రశ్నలున్నాయి. సినిమా షూటింగ్ ఎంత వరకు అయ్యింది ? అక్టోబర్ లో రిలీజ్ ఉంటుందా ? ఇలా అభిమానుల్లో కొన్ని సందేహాలున్నాయి. వీటన్నిటికి తాజా అప్డేట్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. RRR కి సంబంధించి తాజాగా షూటింగ్ అప్ డేట్స్ చెప్పేశారు. రెండు పాటల మినహా షూటింగ్ పూర్తయింది. అంటూ ఎన్టీఆర్ , చరణ్ బైక్ పై వస్తున్న ఓ అదిరిపోయే స్టిల్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.

కేవలం అప్ డేట్ మాత్రమే చెప్పకుండా దానితో పాటు మంచి పోస్టర్ తో ట్రీట్ ఇచ్చాడు జక్కన్న. తాజాగా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షెడ్యుల్ లో కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. త్వరలోనే మిగిలిన రెండు పాటలను షూట్ చేయనున్నారు. అందులో ఒకటి మాంటేజ్ సాంగ్ అని సమాచారం. ఆ సాంగ్ ను తారక్, చరణ్ లపై చిత్రీకరించనున్నారు. ఆ షెడ్యుల్ తో టోటల్ షూట్ కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టనున్నారు.

అయితే మేకర్స్ ఇచ్చిన ఈ అప్ డేట్ తో RRR అక్టోబర్ లో రిలీజ్ అవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. దీన్ని కొట్టి పారేయడానికి లేదు. ఎందుకంటే ఒక వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు షూట్ చేసిన సీన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగేలా టీంని యాక్టివ్ చేశాడు జక్కన్న. షూట్ చేసిన సీన్స్ కి చరణ్, ఎన్టీఆర్ లతో పాటు మిగతా నటీనటులతో ఎప్పటికప్పుడు డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ పెడుతూ వాటి పనులు చూసుకుంటున్నారు. సాంగ్స్ తో పాటు జరిగిన పోర్షన్ కి రీరికార్డింగ్ వర్క్ కూడా చేస్తున్నారు కీరవాణి. ఇలా అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేస్తూ అక్టోబర్ రిలీజ్ ని టార్గెట్ చేస్తున్నాడు రాజమౌళి. అన్ని అనుకున్నట్లు జరిగి అప్పటి వరకు థియేటర్స్ అన్నీ ఓపెన్ అయితే ప్రకటించినట్లే అక్టోబర్ 13న దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/rrr-shooting-completed-except-2-songs-191535/

Monday, June 28, 2021

Ravi Teja Sarath Mandava Movie Shoot Begins From July 1st | Zee Cinemalu Latest News

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, SLV Cinemas LLP Production No 4 Shoot Begins From July 1st Mass Maharaja who introduced many talented directors to the industry and is riding high with the success of Krack will be teaming up with another debut director Sarath Mandava who previously worked as a writer for films of several top stars of south India. Billed to be a unique thriller with story inspired from true incidents, Ravi Teja plays a never-seen-before role in the movie where he will be seen romancing Divyansha Koushik of Majili fame. Sudhakar Cherukuri will produce the yet to be titled flick under SLV Cinemas LLP. Sam CS will score music, while Sathyan Sooryan will crank the camera. The production no 4 of SLV Cinemas LLP will start rolling from July 1st in Aluminum Factory in Hyderabad with Ravi Teja and other prominent cast taking part in it. Few key scenes will be shot in the first schedule. Cast: Ravi Teja, Divyansha Koushik, Nassar, Sr Naresh, Pavitra Lokesh, Rahul Ramakrishna Technical Crew: Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava Producer: Sudhakar Cherukuri Banner: SLV Cinemas LLP Music Director: Sam CS DOP: Sathyan Sooryan Art Director: Sai Suresh Stills: Sai Ram Maganti PRO: Vamsi-Shekar

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/ravi-teja-sarath-mandava-movie-shoot-begins-from-july-1st-191459/

Sharwanand’s New Movie Titled As Oke Oka Jeevitham| Zee Cinemalu Latest News

Young and promising hero Sharwanand’s 30th film is directed by debutant Shree Karthick and bankrolled by SR Prakash Babu and SR Prabhu under ‘Dream Warrior Pictures’. The movie has dialogues by Tharun Bhascker. The makers have unveiled title and first look poster of the film today. Titled Oke Oka Jeevitham, the first look poster looks intriguing, as it discloses theme of the movie billed to be a family drama with sci-fi elements. Sharwanand can be seen carrying guitar on his back. While one side of the poster shows greenery, post office, letter, music cassette, kites etc, the other side sees factories, cell tower, mobile, music system, flight etc. The poster simply describes the impact of globalization. Telugu girl Ritu Varma stars opposite Sharwa, along with Vennela Kishore and Priyadharshi playing the supporting roles. It’s a worthy mention that Amala Akkineni is doing an important role in the film. The music for this film is composed by Jakes Bejoy. ‘Dear Comrade’ fame cinematographer and editor, Sujeeth Sarang and Sreejith Sarang are also part of this movie. Sharwanand has huge following among family audiences and this film is going to equally cater to family viewers as well as the youth. In fact, films with mother-son bonding will enthrall all sections. The shooting of Oke Oka Jeevitham was wrapped up already. Cast: Sharwanand, Ritu Varma, Amala Akkineni, Vennela Kishore, Priyadarshi, Nassar and others. Technical Crew: Written & Direction: Shree Karthick Producers: SR Prakash Babu, SR Prabhu Production Company: Dream Warrior Pictures Dialogues: Tharun Bhascker DOP: Sujith Sarang Music Director: Jakes Bejoy Editor: Sreejith Sarang Art Director: N.Satheesh Kumar Stunts: Sudesh Kumar Stylist: Pallavi Singh Lyrics: Sirivennela Sitaramasastri, Krishnakanth PRO: Vamsi-Shekar

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/sharwanands-new-movie-titled-as-oke-oka-jeevitham-191481/

Wednesday, June 23, 2021

Ram Lingusamy Movie is Ready for Shooting| Zee Cinemalu latest News

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మాస్ యాక్షన్ హీరో అవతారమెత్తిన హీరో రామ్ నెక్స్ట్ లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటివలే #RaPo19 పేరుతో ఎనౌన్స్ అయిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. జులై రెండో వారం నుండి ఓ యాక్షన్ ఎపిసోడ్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నారని సమాచారం. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటంతో రామ్ ప్రస్తుతం ఫిజిక్ కోసం వర్కౌట్స్ చేస్తున్నాడట

సినిమాలో రామ్ కంప్లీట్ మాస్ లుక్ లో కనిపిస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ తో మెప్పిస్తాడని ఇన్సైడ్ టాక్. రామ్ క్యారెక్టర్ ని డిఫరెంట్ డిజైన్ చేశాడట లింగుస్వామి. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు ఆ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో రామ్ కి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

మరి #RaPo19 రామ్ లుక్ ఎలా ఉండబోతుంది ? యాక్షన్ ఎపిసోడ్స్ లో రామ్ ఎలా కనిపిస్తాడనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి రానుందని సమాచారం.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/ram-lingusamy-movie-is-ready-for-shooting-191361

Saturday, June 19, 2021

Adivi Sesh’s Major Shoot To Resume In July| Zee Cinemalu latest News

Adivi Sesh’s Major Shoot To Resume In July Adivi Sesh’s first Pan India film Major had already completed 90% of its shoot and only small portion of filming is pending. Apparently, Sesh is keen to resume the shoot of his most ambitious project for which he has also penned the script. The actor revealed that, the film’s shoot will resume in July. The young hero has shared a working still during the shoot of Major in Chitkul along with his producer Sharath and stated, “When we began #MajorTheFilm last year :) #Chitkul was never colder. 

But brilliant visuals and amazing people led to great memories. Can’t wait to start filming in July. An Epic Story inspired by the life of #MajorSandeepUnnikrishnan :) @SharathWho .” Sashi Kiran Tikka is directing the movie which is based on the life of Sandeep Unnikrishnan, who helped save lives during the 26/11 terror attacks in Mumbai in 2008. Major is one of the most anticipated films and the teaser got overwhelming response across the country. The video that got record views and won appreciation of all indeed set bar high on the film. Major is a hot cake in the business circles and the makers have been getting fancy offers for theatrical and other rights. Overseas rights of the movie were sold recently for a whopping price. Major stars Saiee Manjrekar, Sobhita Dhulipala, Prakash Raj, Revathi and Murli Sharma in pivotal roles. The film is produced by Sony Pictures Films India in association with Mahesh Babu's GMB Entertainment and A+S movies..

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/adivi-seshs-major-shoot-to-resume-in-july-191205/

Nani’s Daare Leda Music Video, featuring Satya Dev and Roopa is out | Zee Cinemalu latest News

 Nani's Daare Leda Music Video, featuring Satya Dev and Roopa is out Since the beginning of the coronavirus, healthcare workers have shown a remarkable resilience and professional dedication despite a fear of becoming infected and infecting others. Natural Star Nani comes up with a covid-themed special music video dedicated for doctors who are the frontline heroes. Nani presents the music video under Wall Poster Cinema, and Chai Bisket executed it. The song Daare Leda starring Satya Dev Kancharana and Roopa Koduvayur has been dropped today in Telugu and Tamil languages. Both Satya Dev and Roopa are seen as a dedicated doctor couple who work in different shifts, missing each other for long time. But they don’t really feel bad about it.

 Finally, when they plan to spend time together on their wedding anniversary, Satya Dev’s reports show he has tested positive for covid-19. Under these circumstances, he asks his wife to go to the hospital, as according to him nothing is important than serving patients. Nani who appears towards the end of the music video requests everyone to wear mask. This video embodies the plight of many healthcare workers who missed their family to serve people during these tough times. Vijay Bulganin has scored the song, while KK has penned the lyrics. Directed by Sumanth Prabhas, cinematography is done by Aditya and Srujana has done the edit . It’s a perfect tribute for the doctors and Nani along with the entire team worked for the video must be appreciated.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/nanis-daare-leda-music-video-featuring-satya-dev-and-roopa-is-out-191196/

Jagame Thanthram Movie Review By Zee Cinemalu News

నటీ నటులు : ధనుష్ , ఐశ్వర్య లెక్ష్మి,జేమ్స్ కస్మో, జోజు జార్జ్, కళయరాసన్ తదితరులు

కెమెరామెన్ : శ్రేయాస్ కృష్ణ

సంగీతం : సంతోష్ నారాయణ్

నిర్మాతలు : శశి కాంత్ , చక్రవర్తి రామచంద్ర

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్

విడుదల తేది : 18 జూన్ 2021

నిడివి : 153 నిమిషాలు

ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జగమే తంత్రం' సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కోవిడ్ 19 కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు OTT ద్వారా రిలీజైంది. మరి వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న ధనుష్ ఈ సినిమాతో OTT బ్లాక్ బస్టర్ అందుకున్నాడా ? కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ఎలా డీల్ చేశాడు ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

లండన్ లో పీటర్ (జేమ్స్ కాస్మో) , శివ దాస్ (జోజు జార్జ్) అనే రెండు గ్యాంగుల మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. శివదాస్ ఆలోచనలు తెలుసుకొని అతన్ని దెబ్బతీసే వ్యక్తి కోసం చూస్తున్న పీటర్ తమిళ్ నాడులో ఉన్న సురులి(ధనుష్) ని లండన్ కి పిలిపిస్తాడు. అలా లండన్ కొచ్చి పీటర్ గ్యాంగ్ లో చేరిన సురులి శివ దాస్ చేసే పనులపై దృష్టి పెట్టి అతని విషయలు పీటర్ కి తెలియజేస్తూ దెబ్బ తీస్తుంటాడు. అలా లండన్ లో సెటిలయిన సురులి అటిల్లా(ఐశ్వర్య లెక్ష్మి) అనే అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు.

పీటర్ ఆఫర్ చేసిన డబ్బు కోసం లండన్ వెళ్ళిన సురిలి అక్కడికి వెళ్ళాక ఎలాంటి జీవితం గడిపాడు ? ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ? లండన్ లో గ్యాంగ్ స్టర్ గా మారిన సురిలి చివరికి విలన్ పీటర్ కి ఎదురెళ్ళి అక్కడి శరణార్ధులను ఎలా ఆదుకున్నాడు ? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

ధనుష్ ఎప్పటిలాగే తన క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు. గ్యాంగ్ స్టర్ గా మెప్పించాడు. కాకపోతే బలమైన సన్నివేశాలు లేకపోవడంతో నటనకి ఎకువ స్కోప్ లేకుండా పోయింది. ఐశ్వర్య లెక్ష్మి తన పాత్రకు న్యాయం చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎప్సిసోడ్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో నటనతో ఆకట్టుకుంది. పీటర్ పాత్రకు జేమ్స్ , శివ దాస్ పాత్రకు జోజు సూటయ్యారు. కళయరాసన్, సౌందర రాజ, దీపక్ పరమేష్ , శరత్, దేవన్ ,సంచన నటరాజన్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు టెక్నికల్ గా బెస్ట్ సపోర్ట్ ఇచ్చిన ఇద్దరి గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. అందులో ఒకరు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ , మరొకరు కెమెరామెన్ శ్రేయాస్ కృష్ణ. మ్యూజిక్ పరంగా సంతోష్ నారాయణ్ బెస్ట్ ఇస్తే, విజువల్స్ పరంగా కృష్ణ బెస్ట్ ఇచ్చాడు. సినిమా చూస్తున్నత సేపు ఈ ఇద్దరి ఎఫర్ట్ కనిపిస్తుంది. వివేక్ హర్షన్ పరవాలేదు. సంతానం, వినోథ్ రాజు కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. దినేష్ సుబ్రహ్మణ్యం స్టంట్ కంపోజిషన్ మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. రాజన్ సౌండ్ డిజైనింగ్ కూడా బాగుంది.

కార్తీక్ సుబ్బరాజు కథ -కథనంతో సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొని మంచి ట్విస్టులు ప్లాన్ చేసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

రెండు గ్యాంగ్ స్టర్ల మధ్య గొడవలు మధ్యలో హీరో ఒక గ్యాంగ్ లో చేరి అపోజిట్ గ్యాంగుని దెబ్బ తీయడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన కథ. అదే కథతో జగమే తంత్రం సినిమా తీశాడు కార్తీక్ సుబ్బరాజు. కాకపోతే శరణార్థులు అనే కాసేపట్ జత చేశాడు. అది కూడా గ్యాంగ్ స్టర్ సినిమాల్లో చెప్పిన పాయింటే కావడంతో అది కూడా ఆసక్తిగా అనిపించదు. పైగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పండలేదు. దాంతో ఎక్కడా ఎమోషన్ క్యారీ అవ్వలేదు.

తొలి పది నిమిషాలు కాస్త స్పీడుతో ఎక్స్ ప్రెస్ లాంటి స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించిన దర్శకుడు ఆ తర్వాత ప్యాసింజర్ లా నత్త నడకన సినిమాను నడిపించిన విధానం విసుగు తెప్పిస్తుంది. దాంతో నిడివి సరిగ్గా ఉన్నా రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇలాంటి సినిమాలను ఫటా ఫట్ సీన్స్ తో అదిరిపోయే ట్విస్టులతో తెరకెక్కించాలి. లేదంటే బోర్ కొట్టేస్తుంది. సినిమాలో ఇంటర్వెల్ కి ముందు దర్శకుడు కార్తీక్ ఓ ట్విస్ట్ ప్లాన్ చేసినప్పటికీ అది కూడా గెస్ చేసేలానే ఉండటంతో వావ్ అనిపించలేదు.

సినిమా ఆరంభంలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ చూసి ఏదో ఊహించిన ప్రేక్షకులకు ఆ సన్నివేశాన్ని చాలా సిల్లీగా తీసి అక్కడి నుండే సినిమాపై అంచనాలు తగ్గించేశాడు దర్శకుడు. లండన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు మినహా సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా బలమైన సన్నివేశాలు అదిరిపోయే స్కీన్ ప్లే లేదు. దీంతో ఆసక్తి కరంగా తీయలేకపోయిన గ్యాంగ్ స్టర్ సినిమాల్లో ఇది కూడా ఒకటిలా ఉంటుందే తప్ప హిట్ సినిమాల్లో చేరలేకపోయింది.

నిజానికి కార్తీక్ సుబ్బరాజ్ నుండి సినిమా వస్తుందంటే తమిళ్ ఆడియన్స్ తో పాటు అతని సినిమాలు ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కూడా చాల ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. అలా ఈ సినిమాపై ఎక్కువ ఊహించుకున్న ఆడియన్స్ జగమే తంత్రం చూసి నిరాశ పడటం ఖాయం. ఇక టైం పాస్ కోసం OTT లో సినిమాలు చూసే వారికి ఈ సినిమా జస్ట్ పరవాలేదనిపిస్తుంది. ఓవరాల్ గా ధనుష్ -సుబ్బరాజ్ కాంబో నిరాశ పరిచి పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Read More: http://www.zeecinemalu.com/en/movie-review/jagame-thanthram-movie-review-in-telugu-zeecinemalu-191150/


Wednesday, June 16, 2021

RangDe World Television Premiere on 20th June in Zee Telugu| Zee Cinemalu Latest News Updates

 "అనుకి అర్జున్ అంటే ప్రాణం. తన జీవితంలో ప్రతి సంతోషాన్ని అర్జున్ తో పంచుకోవాలనుకుంటుంది. అర్జున్ మాత్రం అనును అపార్థం చేసుకుంటాడు. ఇలాంటి ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. తర్వాత ఏం జరిగిందనేది ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. తను అనును అపార్థం చేసుకున్నానని అర్జున్ తెలుసుకుంటాడు. ఇద్దరూ కలిసిపోతారు."

చెప్పుకోవడానికి చాలా సింపుల్ స్టోరీ. కానీ ఇలాంటి సింపుల్ స్టోరీని ఆకట్టుకునేలా తెరపై చూపించడమే కష్టం. అలాంటి టఫ్ జాబ్ ను ఎంతో ఇష్టంగా, అందంగా చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఆ సినిమానే రంగ్ దే.

ప్రేక్షకుల్ని ప్రేమలోకంలోకి తీసుకెళ్లింది ఈ సినిమా. అనుగా కీర్తిసురేష్, అర్జున్ గా నితిన్ పెర్ఫార్మెన్స్, వాళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. లవ్ ఎలిమెంట్స్ తో పాటు సందర్భోచితంగా వచ్చే కామెడీ సీన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి.

థియేటర్లలో సూపర్ హిట్టయిన ఈ సినిమా రీసెంట్ గా ZEE5లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటీటీలో కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడు ZEE TELUGU ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతోంది. మరో 4 రోజుల్లో 20వ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో రంగ్ దే సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/rangde-world-television-premiere-on-20th-june-in-zee-telugu-191045/

Tuesday, June 15, 2021

Prabhas 25th movie with Prashant Neel| Zee Cinemalu Latest News Updates

సలార్.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడ మేటర్ ఇది కాదు. ప్రభాస్-ప్రశాంత్ కాంబోలో మరో సినిమా రాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ 25వ చిత్రం ఇదే.

రీసెంట్ గా మరో పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఆ కథను మహేష్ బాబుకు వినిపించాడట. అయితే కొన్ని కారణాల వల్ల మహేష్ దాన్ని రిజెక్ట్ చేసినట్టు టాక్. ఇప్పుడు అదే స్టోరీతో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మరో సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఓ బడా ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుందట.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పట్లో అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 3 సినిమాలున్నాయి. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ పైకి వస్తుంది. సలార్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ 25వ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.

ఇక సలార్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతోంది. తన చేతిలో ఉన్న సినిమాల్లో ప్రభాస్ ముందుగా ఈ సినిమానే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అటు శృతిహాసన్ కూడా వచ్చే నెల నుంచి ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది. ఈసారి సలార్ కు సంబంధించి చాలా పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/prabhas-25th-movie-with-prashant-neel-191002/

Nikhil Announced That He Is Ready For Shootings | Zee Cinemalu Latest News Updates

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతుండడంతో హీరోలంతా ఒక్కొక్కరుగా తమ సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. హీరో నితిన్ ఆల్రెడీ తను నటిస్తున్న మ్యాస్ట్రో సినిమాను ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో నిఖిల్ కూడా చేరబోతున్నాడు.

తను షూటింగ్స్ కు రెడీ అని ప్రకటించాడు నిఖిల్. త్వరలోనే కార్తికేయ-2, 18-పేజెస్ సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొస్తానని అంటున్నాడు. కార్తికేయ-2 కోసం బాడీ బిల్డింగ్ చేశాడు నిఖిల్. దానికి సంబంధించి కొన్ని స్టిల్స్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.

చందు మొండేటి దర్శకత్వంలో రాబోతోంది కార్తికేయ-2. సూపర్ హిట్టయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా, మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్లపై టి.జి విశ్వ ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్ మొదలవుతుంది.

ఇక నిఖిల్ నటిస్తున్న మరో సినిమా 18-పేజెస్. ఇందులో కూడా నిఖిల్ సరసన అనుపమనే హీరోయిన్ గా నటిస్తోంది. జీఏ 2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు నిఖిల్. పల్నాటి సూర్యప్రతాప్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/nikhil-announced-that-he-is-ready-for-shootings-190943/

Monday, June 14, 2021

Vijay Deverakonda Is The First South Actor To Feature On Dabbo Ratnani’s Calendar| Zee Cinemalu Latest News Updates

బాలీవుడ్ ఫొటొగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో మెరిసిన విజయ్ దేవరకొండ. సౌత్ నుండి మొదటి హీరో..

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్ లో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ లో నిలిచాడు. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్ ల సరసన విజయ్ ఆ క్యాలెండర్ లో కనిపించాడు.

సౌత్ ఇండియా నుండి ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. చేసిన 9 సినిమాలకే ఇలాంటి నేషనల్ క్రేజ్ సంపాదించడం గమనార్హం. దీనికి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు డబూ రత్నాని. రగ్గ్ డ్ అండ్ స్టైలిష్ లుక్ లో విజయ్ సెక్సీగా కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్ ను లాంచ్ చేసిన సందర్భంగా విజయ్ తో ఇన్ స్టా గ్రామ్ లైవ్ ముచ్చటించాడు డబూ.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .‘‘.ఈ ఫొటో షూట్ చాలా తొందరగా,చాలా క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్ లో కనిపించారు. నేను షారుఖ్ ఖాన్ సర్ ను మీ క్యాలెండర్ లో చూసా. తను చాలా మంచి వ్యక్తి. అప్పటినుండి నాకు మీ క్యాలెండర్ లో కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని.ఫైనల్ గా నా కోరిక తీరింది."

డబూ రత్నాని మాట్లాడుతూ : థాంక్యూ విజయ్ దేవరకొండ నా క్యాలెండర్ లో డెబ్యూ చేసినందుకు. మీరు చాలా కూల్ పర్సన్. ఈ ఫొటో షూట్ చేసినపుడు చాలా ఎంజాయ్ చేసాను. నా క్యాలెండర్ లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే. థాంక్యూ.’’ అన్నారు.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/vijay-deverakonda-is-the-first-south-actor-to-feature-on-dabbo-ratnanis-calendar-190953/

Saturday, June 12, 2021

Ardha Shathabdham Movie Review | Zee Cinemalu News Tollywood Updates

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చిన 'అర్థ శతాబ్దం' సినిమా ఎట్టకేలకు OTT ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కార్తీక్ రత్నం హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి కుమార్ , నవీన్ చంద్ర , శుభలేఖ సుధాకర్ , ఆమని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే టీజర్ , ట్రైలర్ ఎట్రాక్ట్ చేసింది. దీంతో సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. మరి రిలీజ్ కి ముందు కంటెంట్ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా OTT ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

తెలంగాణా నేపథ్యంలో ఓ కథ రాసుకొని అందులో కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసి నేచురాలిటీ కి దగ్గర ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు ఆసక్తి కరమైన కథనం, బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో విఫలమయ్యాడు. నిజానికి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కొనసాగుతున్న కుల వివక్ష మీద కథను రాసుకున్న దర్శకుడి ఆలోచన మంచిదే. కానీ పేపర్ పై తను రాసుకున్న ఆ కథను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడు రవీంద్ర. ఇలాంటి కథలో కేవలం ఎమోషన్ ఒక్కటే నింపితే వర్కౌట్ అవ్వదు. ఇంకా కొన్ని ఎలిమెంట్స్ చేర్చి చక్కని డ్రామా పండించాలి. అప్పుడే ఇలాంటి కథలు క్లిక్ అవుతాయ్. ఆ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆసక్తికరంగా కథనం రాసుకోకపోవడంతో సినిమా ల్యాగ్ అనిపిస్తూ అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది. OTT లో ఆడియన్ కి ఉన్న స్కిప్ ఆప్షన్ వాడకుండా సినిమాను తీయలేకపోయాడు దర్శకుడు.

ఇక నటీనటుల విషయానికొస్తే కేరాఫ్ కంచర పాలెం తో నటుడిగా మంచి గుర్తింపుతో పాటు వరుస అవకాశాలు అందుకుంటున్న కార్తీక్.... కృష్ణ పాత్రలో మంచి నటన కనబరిచాడు. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కార్తీక్ నటించిన తీరు ఆకట్టుకుంటుంది. సరైన కథ పడితే హీరోగా మంచి స్థాయికి చేరుకుంటాడు. ఇక పుష్ప పాత్రలో కృష్ణ ప్రియ కూడా చక్కని నటన ప్రదర్శించింది. పల్లెటూరి అమ్మాయిగా పాత్రలో ఒదిగిపోయింది. లుక్ నవీన్ చంద్ర ఎప్పటిలానే తన పాత్రతో ఆకట్టుకొని మరోసారి తనకిచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. కాకపోతే క్యారెక్టర్ డిజైనింగ్ తేడా కొట్టింది. సాయి కుమార్ , శుభలేక సుధాకర్ , ఆమని వంటి సీనియర్లు తలో పాత్ర వేసి ఉన్నంతలో సన్నివేశాలకు అందం తీసుకొచ్చారు. సాయి కుమార్ పాత్రపై స్పష్టత వచ్చేలా సన్నివేశాలు పడలేదు.

ఇక టెక్నికల్ గా చూసుకుంటే సినిమాకు మ్యూజిక్ అందించిన నఫ్వాల్ రాజా తన టాలెంట్ తో సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాడు. ముఖ్యంగా అతను అందించిన నేపథ్య సంగీతం బాగుంది. మెరిసేలే పాట ఆకట్టుకుంది. మిగతా పాటలు మాత్రం జస్ట్ ఫరవాలేదనిపిస్తాయి. అశ్కేర్, వెంకట్ , వేణు సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి లోకేషన్స్ ని బాగా చూపిస్తూ కథకు సరైన విజువల్స్ అందించారు. విలేజ్ సెటప్ చేసిన సునీత్ ఆర్ట్ డైరెక్టర్ పనితనం బాగుంది. ఇక దర్శకుడు రవీంద్ర ఎంచుకున్న కథ బాగుంది కానీ కథనం సినిమాకు మెయిన్ మైనస్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.25/5

Read More: http://www.zeecinemalu.com/en/movie-review/ardha-shathabdham-movie-telugu-review-zeecinemalu-190881/

Official statement from Sarkaru Vaari Paata Unit | Zee Cinemalu News Tollywood Updates

సర్కారు వారి పాట షూటింగ్ తిరిగి ప్రారంభించగానే మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అధికారికంగా ప్రకటిస్తాం - చిత్ర యూనిట్.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం 'సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే..కాగా 'సర్కారు వారి పాట షూటింగ్ తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అధికారికంగా ప్రకటిస్తామని అప్పటివరకు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ సురక్షితంగా ఉండండి' అని చిత్ర యూనిట్ తెలిపింది.

నటీనటులు: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు టెక్నీషియన్స్ సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌, సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/official-statement-from-sarkaru-vaari-paata-unit-190844/


Wednesday, June 2, 2021

Rajamouli Planning a Hollywood Movie | Zee Cinemalu Latest News Updates

 ప్రస్తుతం ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో రాజమౌళి 'RRR' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే ఈ ఏడాదిలో సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది. ఇక దీంతో రాజమౌళి నెక్స్ట్ సినిమాల విషయంలోనూ ఇంకా ఆలస్యం జరగనుంది. నెక్స్ట్ మహేష్ బాబుతో జక్కన్న ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత KL నారాయణ ఇద్దరికీ ఓ ప్రాజెక్ట్ కోసం ఎప్పుడో అడ్వాన్స్ అందించారు. మొన్నీ మధ్యే రాజమౌళి కూడా మహేష్ నెక్స్ట్ సినిమా చేయనున్నట్లు ప్రకటించేశాడు.

అయితే మహేష్ సినిమా అవ్వగానే మరో భారీ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు రాజమౌళి. అవును హాలీవుడ్ లో ఓ సినిమా తీయబోతున్నాడట జక్కన్న, ఆ సినిమా కోసం ఓ సంస్థ టైయప్ అవ్వనున్నాడని తెలుస్తుంది. అయితే ఆ సినిమా హాలీవుడ్ స్టైల్ లో కాకుండా మన కథతో హాలీవుడ్ మేకింగ్ తో ఉంటుందట. ఇదే ఇప్పుడు రాజమౌళి అభిమానులను సర్ ప్రయిజ్ చేస్తున్న విషయం. ఇక్కడి కథతో అక్కడి వాళ్ళను రాజమౌళి ఎలా మెప్పిస్తాడు ? ఇందులో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి ? అంటూ అప్పుడే డిస్కషన్ మొదలు పెట్టేశారు.

నిజానికి ప్లాన్ అయితే రెడీ గా ఉంది కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ప్రస్తుతం రాజమౌళి చేతిలో ఉన్న RRR సినిమా పూర్తి చేసి ఆ తర్వాత మహేష్ సినిమా చేయాల్సి ఉంది. మహేష్ సినిమా అంటే ఎలాగో రెండేళ్ళపైనే పడుతుంది. సో రాజమౌళి హాలీవుడ్ సినిమాకు ఎంత లేడన్నా ఇంకా మూడేళ్ళు పట్టనుంది. ఈ లోపు ఆ సినిమాకు తండ్రి దగ్గరి నుండి కథ -కథనం రాయిన్చుకుంటాడు జక్కన్న. ఇప్పుడే స్టార్ట్ అవ్వకపోయినా రాజమౌళి హాలీవుడ్ మూవీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. చూడాలి జక్కన్న ఆ సినిమాతో తెలుగు చిత్ర దర్శకుడిగా అక్కడ ఎలాంటి స్థానం అందుకుంటాడో?

Tuesday, June 1, 2021

RRR – Big Fight between NTR and Ramcharan| Zee Cinemalu Latest News Updates

RRR Movie స్టోరీలైన్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. కేవలం అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలతో అల్లిన ఫిక్షన్ కథ అని మాత్రమే తెలుసు. ఇద్దరూ ఒకే కాలంలో, ఒకే ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఎక్స్ క్లూజివ్ మేటర్ బయటపడింది.

RRR మూవీలో ఎన్టీఆర్-రామ్ చరణ్ మధ్య భీకరమైన ఫైట్ సీక్వెన్స్ ఉంది. టోటల్ సినిమాకే అది హైలెట్ అవుతుంది. ఆ ఫైట్ సీన్ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయంట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ బయటపెట్టారు.

"ఫైట్స్ వస్తుంటే విలన్ ను హీరో నరకాలని కోరుకుంటాం. అదే ఇద్దరు మంచివాళ్లు కొట్టుకుంటుంటే ఏం కోరుకుంటాం. ఎవర్ని సపోర్ట్ చేస్తాం. ఇద్దరు సూపర్ స్టార్లు, ఇద్దరూ మంచోళ్లే. సినిమాలో ఎన్టీఆర్ మంచోడని చరణ్ కు తెలుసు. చరణ్ మంచోడని ఎన్టీఆర్ కు కూడా తెలుసు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరూ తలపడతారు. వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే మనకు ఏడుపొస్తుంది. ఫస్ట్ టైమ్ నాకథ రాసింది తానే అయినా, అది సినిమా అని తెలిసినా, చివరికి ఇద్దరూ కలుస్తారనే విషయం కూడా తెలిసినా.. ఆ క్షణంలో ఎన్టీఆర్-చరణ్ ఫైట్ చేస్తుంటే చాలా ఎమోషనల్ అయ్యానని అన్నారు విజయేంద్రప్రసాద్. ఇలా RRR Movieలో చరణ్-తారక్ మధ్య భారీ ఫైట్ ఉందనే విషయాన్ని బయటపెట్టారు.

ఇక RRR అప్ డేట్స్ విషయానికొస్తే.. 2 పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రాజమౌళి రెడీగా ఉన్నాడు. కేవలం 2 పాటలు, ప్యాచ్ వర్క్ అయినప్పటికీ.. షూటింగ్ కు 40 నుంచి 50 రోజులు పడుతుందని అంచనా.కు ఫైట్ చూస్తే కన్నీళ్లు వచ్చాయి."

ఇక పాటల విషయానికొస్తే... చరణ్, తారక్ పై వచ్చే ఇంట్రో సాంగ్ పెండింగ్ ఉంది. అది తీయడానికి కనీసం 30 రోజులు పడుతుందట. ఇక అలియాభట్-చరణ్ కాంబినేషన్ లో ఓ సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న RRR సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/rrr-big-fight-between-ntr-and-ramcharan-190255/


A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...