Suresh Productions, Guru Films and Kross Pictures Collaborate Again For Remake Of Midnight Runners Suresh Productions, Guru Films and Kross Pictures, the winning combination of Oh! Baby, have come back together to collaborate on the official remake of South Korean action-comedy film, Midnight Runners. D. Suresh Babu, Sunitha Tati and Hyunwoo Thomas Kim are the producers. Helmed by the very talented director Sudheer Varma, the film stars Regina Cassandra and Nivetha Thomas in lead roles. Both Regina and Nivetha will be performing stunts for the first time. Like Oh! Baby’s original version Miss Granny which had a universal appeal, the story of Midnight Runners also has global appeal and can similarly enthuse the Telugu audience. The yet- to-be-titled film has finished first schedule of shoot in March and has resumed the final schedule, post lockdown. The entire filming finishes by the end of August. Richard Prasad is the cinematographer, while Mikey McCleary scores music. Cast : Regina Cassandra, Nivetha Thomas Technical Crew: Director: Sudheer Varma Producers: D. Suresh Babu, Sunitha Tati, Hyunwoo Thomas Kim Production houses: Suresh Productions, Guru Films, Kross Pictures Cinematography: Richard Prasad Music Director: Mikey McCleary Editor: Viplav Nyshadam Line Producer: Vijay Shankar Donkada Art Director: Gandhi Nadikudikar Marketing: Lipika Alla PRO: Vamsi-Shekar
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/suresh-productions-guru-films-and-kross-pictures-collaborate-again-for-remake-of-midnight-runners-192559/Tuesday, July 27, 2021
Friday, July 23, 2021
No Clarity On Nani’s Tuck Jagadish Release | Zee Cinemalu Latest Movie News
నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీ #TuckJagadish గురించి మేకర్స్ నుండి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు నాని ఫ్యాన్స్. సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులైంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు. భారీ హంగామా చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. సరిగ్గా థియేటర్స్ లోకి వచ్చే టైంకి కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగిలింది. ఆ వెంటనే సినిమాను వాయిదా వేసుకున్నారు మేకర్స్.
త్వరలోనే థియేటర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి.
తెలంగాణాలో అంతా క్లియర్ అయింది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేటు మేటర్ తేలాల్సి
ఉంది. మరో రెండు మూడు రోజుల్లోనే ఏపీ థియేటర్స్ రీ ఓపెన్ మీద క్లారిటీ రానుంది. ఈ నెల
ముప్పు నుండి చిన్న సినిమాలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. అయితే
ఇప్పడు అందరి చూపు టక్ జగదీష్ పైనే ఉన్నాయి. ఈ సినిమాను డైరెక్ట్ గా OTT లో రిలీజ్
చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ విషయంపై మేకర్స్ నుండి మాత్రం
ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందా ? లేదా OTT ద్వారా
ఇంట్లోకే వచ్చేస్తుందా ? అనేది తెలియక మేకర్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు
నాని ఫ్యాన్స్. నిజానికి ఇది మంచి ఎమోషన్స్ తెరకెక్కిన ఫ్యామిలీ సినిమా అని ఫ్యామిలీ
అంతా కలిసి చూడాలని ప్రమోషన్స్ లో చెప్పారు యూనిట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ
థియేటర్స్ కి రావడం కష్టమని భావించి OTT రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా ? తెలియాల్సి ఉంది.
Sarpatta Movie Review By Zee Cinemalu Latest Movie News | Tollywood Buzz
నటీనటులు: ఆర్య, దుషారా విజయన్, పశుపతి, అనుపమ కుమార్, జాన్ కొక్కెన్ తదితరులు సంగీతం : సంతోష్ నారాయణ్ సినిమాటోగ్రఫీ : మురళి.జి ఎడిటర్ : సెల్వ ఆర్.కె నిర్మాణం : నీలం ప్రొడక్షన్స్, కె9 స్టూడియో నిర్మాతలు : షణ్ముగం దక్షన్ రాజ్ దర్శకత్వం : పా.రంజిత్ విడుదల తేది : 22-07-2021 రన్ టైమ్: 2 గంటల 45 నిమిషాలు
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు
మనకు కొత్త కాదు. చాలానే వచ్చాయి. మరీ ముఖ్యంగా వారం కిందటే తూఫాన్ పేరిట పేరిట ఓ బాక్సింగ్
మూవీ వచ్చింది. ఇప్పుడు షార్ట్ గ్యాప్ లో సార్పట్ట పేరుతో మరో బాక్సింగ్ మూవీ డైరక్ట్
ఓటీటీ రిలీజ్ గా వచ్చింది. మరి ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్
రివ్యూ
కథ
బ్రిటిషర్లు తమ సరదా కోసం కొంతమంది భారతీయులకు
బాక్సింగ్ నేర్పిస్తారు. అలా తమిళనాడుకు చెందిన సార్పట్ట పరంపర, ఇడియప్ప కుటుంబాలు
బాక్సింగ్ ను నేర్చుకొని అనాదిగి కొనసాగిస్తుంటాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడూ
బాక్సింగ్ రచ్చ నడుస్తూనే ఉంటుంది. వీళ్లలో సార్పట్ట కు చెందిన వ్యక్తి సమరన్.
అది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు. ఆ
టైమ్ లో హార్బర్ లో కూలీగా చేస్తుంటాడు సమరన్ (ఆర్య). ఇతడికి బాక్సింగ్ అంటే పిచ్చి.
కానీ తల్లి మాత్రం అతడ్ని బాక్సింగ్ వైపు వెళ్లనివ్వదు. ఎఁదుకంటే, బాక్సింగ్ మూలంగానే
భర్తను కోల్పోతోంది కాబట్టి. అయితే ఓ అనుకోని ఘటనతో సమరన్ బాక్సర్ గా మారాల్సి వస్తుంది.
ఇడియప్పకు చెందిన వేటపులి (జాన్ కొక్కెన్)తో తలపడాల్సి వస్తుంది. మరి బాక్సర్ గా మారేందుకు
తల్లిని సమరన్ ఒప్పించాడా? అతడు ఎఁదుకు బాక్సర్ గా మారాల్సి వచ్చింది? ఫైనల్ గా అతడు
ఏం సాధించాడనేది సార్పట్ట స్టోరీ
నటీనటుల పనితీరు
నటుడిగా ఆర్యను ఓ మెట్టు పైకి ఎక్కించింది
ఈ సినిమా. ఈ మూవీ కోసం అతడి పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. బాక్సర్ ఫిజిక్ కోసం కష్టపడ్డమే
కాకుండా, నటన పరంగా కూడా ఆర్య మంచి మార్కులు సాధించాడు. బాక్సర్ గా అతడి బాడీ లాంగ్వేజ్
చాలా బాగుంది. దీనికితోడు సినిమాలోని ఓ షేడ్ లో చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిగా కూడా
చక్కగా నటించాడు.
ఆర్య భార్యగా దుషారా విజయన్ బాగా చేసింది.
సంచనా నటరాజన్, జాన్ కొక్కెన్, కలైరాసన్, సంతోష్ ప్రతాప్, జాన్ విజయ్, షబ్బీర్‌లు
తమ పాత్రల మేరకు నటించారు. ఆంగ్లో ఇండియన్‌గా జాన్ విజయ్ డైలాగ్స్ అలరిస్తాయి. డ్యాన్సింగ్
రోజ్‌గా షబ్బీర్ నటన కామెడీ పంచుతుంది. ఇక కోచ్ రంగయ్య పాత్రలో పశుపతి యాక్టింగ్
బాగుంది.
టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా ముందుగా చెప్పుకోవాల్సిన
వ్యక్తి ఆర్ట్ డైరక్టర్ రామలింగం. 70ల కాలం నాటి పరిస్థితుల్ని కళ్లకుకట్టేలా సెట్స్
వేశాడు రామలింగం. అతడి ఆర్ట్ వర్క్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. దీన్ని మరింత
ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్, కలర్ టోన్ కుదిరాయి. ఇక రెండో వ్యక్తి సంగీత దర్శకుడు
సంతోష్ నారాయణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కు రీ-రికార్డింగ్ చాలా ముఖ్యం. బ్యాక్
గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంటే, సినిమా అంత ఎలివేట్ అవుతుంది. ఈ విషయంలో సంతోష్ నారాయణన్
కు వందకు వంద మార్కులు వేయాల్సిందే. సినిమాకు అతడిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింప్లీ
సూపర్బ్. ఇక దర్శకుడి విషయానికొస్తే, పా.రంజిత్ ఈ స్పోర్ట్స్ డ్రామాను బాగా రాసుకున్నాడు
కానీ ఫస్టాఫ్ లో కనిపించినంత ఉత్సాహం సెకెండాఫ్ లో కనిపించలేదు. ఇతడి సినిమాల్లో ఎక్కువగా
కనిపించే సెకెండాఫ్ డ్రాగ్ అనే ఎలిమెంట్ సార్పట్టలో కూడా కనిపించింది.
జీ సినిమాలు రివ్యూ
ఇంతకుముందు పా.రంజిత్ దర్శకత్వంలో కాలా,
కబాలి సినిమాలొచ్చాయి. సార్పట్టను కూడా అలానే ఊహించుకొని చూస్తే మాత్రం పప్పులో కాలేసినట్టే.
ఎందుకంటే, ఆ రెండు రజనీకాంత్ సినిమాలు. ఇది ఆర్య సినిమా. ఆర్య స్టార్ కాదు. ఈ విషయం
పా రంజిత్ కు బాగా తెలుసు. అందుకే సార్పట్ట సినిమాను కేవలం పాత్రల మీద నడిపించాడు.
ఇందులో హీరోల కంటే పాత్రలే కనిపిస్తాయి. ప్రతి పాత్రకు వెయిట్ ఇచ్చాడు, ప్రతి పాత్రను
పండించాను. అందుకే సార్పట్టతో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు సెకండాఫ్
కు వచ్చేసరికి ఈ దర్శకుడిలో ఒక రకమైన నీరసం లేదా భయం ఆవహిస్తున్నట్టుంది. అమాంతం సన్నివేశాలు
సాగదీస్తున్నాడు, రన్ టైమ్ పెంచేస్తున్నాడు. సార్పట్ట సెకెండాఫ్ లో అది కనిపించింది.
ఈ సినిమా 12 నిమిషాలు తక్కువగా 3 గంటలు నిడివి ఉంది. అంతసేపు సినిమా చూడడం కష్టం. ఓటీటీలో
ఉంది కాబట్టి అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వాడ్ చేసుకునే వెసులుబాటు ఉండడం అదృష్టం.
ఆర్య ఈ సినిమాకు ప్రాణం పోశాడు. తనకు
మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో అతడు పనిచేశాడు. అటు పా రంజిత్ కూడా ఏ పాత్రకు ఏ
నటుడితై ప్రాణం పోస్తాడో రీసెర్చ్ చేసి మరీ నటీనటుల్ని ఎంపిక చేసుకున్నట్టున్నాడు.
మూవీలో ప్రతి పాత్ర తనదైన ముద్ర వేస్తుంది.
ప్లస్ పాయింట్స్ - ఫస్టాఫ్ - ఆర్య యాక్టింగ్
- ఇతర నటీనటుల నటన - దర్శకత్వం - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ఆర్ట్ వర్క్
మైనస్ పాయింట్స్ - రన్ టైమ్ - సెకెండాప్
లో సాగదీత
బాటమ్ లైన్ - ఫీల్ గుడ్ స్పోర్ట్స్ డ్రామా
రేటింగ్ - 3/5
Thursday, July 22, 2021
Pelli Sandad To Release In September| Zee Cinemalu Movie News In Tollywood
పాతికేళ్ల ముందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన మ్యూజికల్ మ్యాజిక్ ‘పెళ్లి సందడి’. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ
మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో
రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’తో మరోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి
రోణంకి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్
దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాటి `పెళ్లిసందడి`లో శ్రీకాంత్ హీరో అయితే
నేటి ‘పెళ్లిసందD’లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో అవడం విశేషం. శ్రీలీల హీరోయిన్.
ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా
జరుగుతున్నాయి.
అన్ని జోనర్స్‌లో బ్లాక్ బస్టర్స్
సినిమాలు తీసి ఎందరో స్టార్స్ రేంజ్‌ను పెంచిన సీనియర్ దర్శకుడు, ఎందరో హీరోయిన్స్‌ను
స్టార్స్ హీరోయిన్స్‌గా మార్చిన గోల్డెన్ హ్యాండ్ రాఘవేంద్రరావు గైడెన్స్‌లో రూపొందుతోన్న
సినిమా కావడంతో ‘పెళ్లి సందD’ పై అంచనాలు పెరిగాయి.
నిర్మలా కాన్వెంట్ తో వెండితెరకు పరిచయమైన
శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. రోషన్, శ్రీలీల జోడీ మూవీకి
ఓ ఫ్రెష్ లుక్‌ను తీసుకొచ్చింది. ఇద్దరూ ఎంతో చక్కగా క్యూట్‌గా పాత్రలను ఫెంటాస్టిక్‌గా
క్యారీ చేశారు. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, ఎమోషన్స్, కామెడీ అన్ని అంశాలతో
సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది.
రాఘవేంద్రరావు, కీరవాణిగారి కాంబినేషన్
ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి కీరవాణిగారు తన సంగీతంతో
ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు వచ్చిన
ఆదరణే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. మిగిలిన పాటలను, టీజర్, ట్రైలర్‌ను త్వరలోనే
ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు
రీ రికార్డింగ్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌లో
విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు: రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్,
రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల
కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ,
జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు..
సాంకేతిక వర్గం: సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్త, చంద్రబోస్ సినిమాటోగ్రఫి: సునీల్ కుమార్ నామ ఎడిటర్:
తమ్మిరాజు ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, మాటలు: శ్రీధర్ సీపాన నిర్మాతలు: మాధవి
కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దర్శకత్వ పర్యవేక్షణ: కె.
రాఘవేంద్రరావు బి.ఎ దర్శకత్వం: గౌరీ రోణంకి.
Devisri Prasad Music for Sharwanand Rashmika Movie| Latest Zee Cinemalu News
శర్వానంద్, తిరుమల కిషోర్, ఎస్ ఎల్ వి సినిమాస్ ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో మ్యూజిక్ డైరక్టర్ గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్,
హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు
దర్శకుడు కిషోర్ తిరుమల.
ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న
క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండనున్నాయని, కిశోర్ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా
ఈ సినిమాను తెరకెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది
అని చిత్ర యూనిట్ తెలిపింది
‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’
సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్ క్యారెక్టర్స్ మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని
తెలుస్తుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
నటీనటులు: శర్వానంద్, రష్మికా మందన్నా,
‘వెన్నెల’ కిశోర్, రవి
శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్,
ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్ రాజు తదితరులు...
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/devisri-prasad-music-for-sharwanand-rashmika-movie-192364/
Dhanush Venky Movie Locked | Latest Zee Cinemalu News
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల తెలుగు , తమిళ్ లో బైలింగ్వెల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రాజీ ప్రాజెక్ట్ తో తో పాటు తెలుగులో ఇంకో సినిమా కూడా ఫైనల్ చేసుకున్నాడట ధనుష్. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగవంశీ, ధనుష్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయనున్నాడట. ఇప్పటికే ధనుష్ కి స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టేశాడట వెంకీ అట్లూరి.
అయితే ముందు శేఖర్ కమ్ముల సినిమాను మొదలు
పెట్టబోతున్నాడు ధనుష్. ఆ సినిమాకు సంబంధించి రెండు షెడ్యుల్స్ పూర్తయ్యాక వెంకీ తో
సినిమా స్టార్ట్ చేస్తాడని సమాచారం. ఈ సినిమాలో ధనుష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా
నటించనుందని ఇన్సైడ్ టాక్. ఇటివలే మేకర్స్ పూజ ని సంప్రదించి అడ్వాన్స్ అందించారని
తెలుస్తుంది. అంతే కాదు సినిమాలో ఒక కీ రోల్ కోసం వెంకీ అట్లూరి సీనియర్ హీరోయిన్ భూమిక
ని అప్రోచ్ అయ్యాడట.
ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్
శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు కాస్టింగ్ ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు వెంకీ
అట్లూరి. దసరా కల్లా అన్నీ పనులు పూర్తి చేసి పూజా కార్యక్రమాలతో సినిమాను మొదలు పెట్టనున్నారట
మేకర్స్. ఈ లోపు అంటే వినాయకచవితి రోజు ఈ కాంబో సినిమాను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని
సమాచారం. టాలీవుడ్ పై ఫోకస్ పెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిటవుతున్న ధనుష్ వీటితో
తెలుగు ప్రేక్షకులకు ఎలా మెప్పించి విజయాలు అందుకుంటాడో వేచి చూడాలి.
Tuesday, July 20, 2021
Aadhi Pinisetty Is The Main Villain In Ram-Lingusamy Movie| Latest Zee Cinemalu News
లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు రామ్. #Rapo19 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సినిమాలో విలన్ గా కొందరు హీరోల పేర్లు చక్కర్లు కొడుతుండగా తాజాగా విలన్ ఎవరనేది తెలియజేస్తూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఆది పినిశెట్టి ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడు. ఆది పినిశెట్టి కి వెల్కం చెప్తూ ఈ విషయాన్ని చెప్పారు మేకర్స్.
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు'
సినిమాలో స్టైలిష్ విలన్ గా నటించాడు ఆది పినిశెట్టి. ఆ సినిమాతో విలన్ గా మంచి ఆదరణ
అందుకున్నాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా సినిమాలు చేశాడు. ప్రస్తుతం హీరోగా
మూడు సినిమాలు చేస్తున్న ఆది మళ్ళీ ఇప్పుడు రామ్ సినిమాతో విలన్ గా కనిపించబోతున్నాడు.
లింగుస్వామి ఆది కోసం మంచి పవర్ ఫుల్ విలనిజం చూపించే క్యారెక్టర్ డిజైన్ చేశాడట.
లింగుసామి సినిమాల్లో హీరో పాత్రలు ఎంత
పవర్ ఫుల్ గా ఉంటాయో, విలన్ పాత్రలు కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి. ఈ దర్శకుడు తీసిన
గత సినిమాలు చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. ప్రత్యేకంగా విలన్ కోసం కూడా ట్రాక్స్
రాయడం ఈ డైరక్టర్ స్పెషాలిటీ. విలనిజంను పీక్స్ లో ఎలివేట్ చేసి, హీరోయిజం పండించే
అతికొద్ది మంది సౌత్ దర్శకుల్లో లింగుసామి ఒకడు. అందుకే ఇతడి సినిమాల్లో విలన్ పాత్ర
పోషించిన నటులకు కూడా గుర్తింపు వస్తుంది. ఈ ట్రాక్ రికార్డ్ తెలుసుకున్నాడు కాబట్టే..
ప్రస్తుతం హీరోగా నటిస్తున్నప్పటికీ, మరోసారి విలన్ గా కనిపించేందుకు ఒప్పుకున్నాడు
ఆది.
ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్
ఉన్న పాత్రలో నటించనున్నాడని టాక్ వినబడుతుంది. అందులో ఒకటి డాక్టర్ కాగా మరొకటి పోలిస్
అని సమాచారం. ఇటివలే 'రెడ్' లో రామ్ డ్యుయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా
రామ్ కి ఆశించిన ఫలితం అందించలేదు. మరి ఈ బైలింగ్వెల్ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో
చూడాలి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న
ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
Interview – Srikanth Addala ( Narappa Movie Director ) | Latest Zee Cinemalu Telugu News
కొందరు దర్శకులకి ఓ బ్రాండ్ ఉంటుంది. అలాగే శ్రీకాంత్ అడ్డాల కి కూడా ఫ్యామిలీ డైరెక్టర్ అనే బ్రాండ్ ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ సినిమాలతో ఆ బ్రాండ్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప తో మాస్ డైరెక్టర్ అనిపించుకోబోతున్నాడు. వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన 'నారప్ప' OTT లో రిలీజైంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మీడియాతో ముచ్చటించాడు.
నేనే అడిగా
అసురన్ చూడగానే బాగా నచ్చేసింది. మంచి
ఎమోషన్ ఉన్న కమర్షియల్ కథ అనిపిచింది. ఒక సారి సురేష్ బాబు గారిని వేరే పని మీద కలిసినప్పుడు
ఆయన రీమేక్ రైట్స్ తీసుకున్నారని చెప్పారు. ఎవరినైనా అనుకుంటున్నారా ? అనడిగి నేను
చేస్తా అండి అనడిగాను. ఆయన ఓకె అన్నారు. వెంటనే వెంకటేష్ గారిని కలవడం అంతకు ముందు
ఆయనతో వర్క్ చేసిన రిలేషన్ తో ప్రాజెక్ట్ ఓకె అయిపొయింది.
మార్పులు చేయాలనుకోలేదు
కొన్ని సినిమాలు ఎలాంటి మార్పులు చేయకుండా
తీయాల్సి ఉంటుంది. అసురన్ అలాంటి సినిమానే. ఎక్కువ మార్పులు చేస్తే చెడ గొట్టేసాడు
రా అంటారు. అందుకే మన నేటివిటీ కి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు మాత్రమే చేసి నారప్ప
తీశాం.
లొకేషన్ లో అదే జరిగింది.
బేసిక్ గా నేను మంచోడు.. మంచితనం లాంటి
సినిమాలు తీశాను. ఆ ముద్ర నాపై ఎక్కువగా ఆంది. లొకేషన్ లో మాస్ సీన్స్ చూసినప్పుడు
మా టీంలో అందరూ ఎలాంటి సినిమాలు తీశారు సార్ ఇప్పుడు కత్తి రక్తం చూపిస్తున్నారని నవ్వుతూ
అనేవారు. కొందరైతే మీలో ఉన్న అసలు మాస్ దర్శకుడు బయటికొచ్చాడు. మీలో ఉన్న ఒరిజినల్
బయటికొచ్చిందని కూడా అన్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో కొన్ని
కామెంట్స్ కూడా వచ్చాయి. అందులో శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి సినిమా చేస్తాడనుకోలేదు రా
ఆంజనేయులు అనే ఫన్నీ కామెంట్ బాగా నచ్చింది. అవన్నీ చూసి నవ్వుకున్నాను.
వెంకటేష్ గారు బెస్ట్ ఎఫర్ట్
ఈ సినిమాని వెంకటేష్ గారు ఛాలెంజింగ్
గా తీసుకొని నటించారు. కొన్ని సీన్స్ అయ్యాక కూడా అదే ట్రాన్స్ లో ఉండేవారు. ఈ సినిమాలో
గెటప్ పరంగా యాక్షన్ పరంగా కొత్త వెంకటేష్ గారిని చూస్తాం. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్
లకి ఆయన చాలా కష్టపడ్డారు. మా టీం కూడా ఎప్పుడెప్పుడు షెడ్యుల్ కి బ్రేక్ ఇస్తారా
? అని ఎదురుచూసేవాళ్ళు. అందరూ కష్టపడి ఇష్టంతో సినిమా ఇది.
బాధ పడ్డాం నిజమే ..కానీ
సినిమా మొదలు పెట్టిన దగ్గరి నుండి థియేటర్స్
లో ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనుకునే ఆలోచనతోనే చేశాం. సౌండ్ విషయంలో
మిగతా టెక్నికల్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని థియేటర్స్ కోసం చేశాం. కానీ సడెన్
గా OTT రిలీజ్ కి వెళ్తున్నామని నిర్మాతలు చెప్పగానే షాకయ్యాం. నేను హీరో గారు అందరం
ఫీలయ్యాం. కానీ మా నిర్మాతా థాను గారి నిర్ణయం తీసుకోవడంతో ఇలా జరిగింది. కానీ ప్రస్తుతం
పరిస్థితులు బాలేదు కాబట్టి ఇవన్నీ ఆలోచించే మా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అందుకే మణిశర్మ గారిని తీసుకున్నాం
నాకు మణిశర్మ గారికి మంచి రిలేషన్ ఉంది.
నా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి ఆయనే నేపథ్య సంగీతం అందించారు. అలాగే
సురేష్ ప్రొడక్షన్ లో కూడా సినిమాలు చేశారు. ఆయన మ్యూజిక్ టాలెంట్ మనందరికీ తెలిసిందే.
ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు.
గణేష్ పాత్రో గారిని మిస్ అవుతున్నా
గణేష్ పాత్రో గారి రైటింగ్ అంటే చాలా
ఇష్టం. ఆయన వర్క్ చేసిన సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో మాటలంటే ఎంతో ఇష్టం. సీతమ్మ
వాకిట్లో సిరిమల్లె చెట్టు టైంలో ఆయనకి ఆసక్తి లేకపోయినా బ్రతిమిలాడి నేను ఆయన చేత
మాటలు రాయించుకున్నా. ఆయన ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. గణేష్ గారిని చాలా మిస్ అవుతున్నా.
అనంతరం నేపథ్యంలో
నారప్ప విషయంలో మాకు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే
లోకేషన్స్. ఈ కథని మన నేటివిటీతో ఎక్కడ చూపించాలి అని చాలా ఆలోచించాం. ఫైనల్ గా అనంతపురం
ఎంచుకున్నాం. కేవలం నేపథ్యమే కాకుండా ఆక్కడి యాసతోనే సినిమాని తీశాం. ఆ యాస కోసం అక్కడి
నుండి ఒకబ్బాయి ని పిలిపించుకొని తన మాటలు రికార్డ్ చేసుకుంటూ కొంత రీసెర్చ్ చేసుకున్నాను.
ఆ అమ్మాయి తప్ప
సినిమాలో అందరూ తెలుగు నటీ నటులనే తీసుకున్నాం.
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ క్యారెక్టర్ కి మాత్రం ఒరిజినల్ లో చేసిన అమ్ము అభిరామి
ని తీసుకున్నాం. . తన కళ్ళు పెద్దగా ఉంటూ పల్లెటూరి అమ్మాయిగా బాగుంటుంది. అందుకే ఆ
క్యారెక్టర్ కి తనే పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నాం.
నాది స్లో మెథడ్
నా కెరీర్ చూసుకుంటే చేసింది నాలుగు సినిమాలే.
నేను కొంచెం స్లో మెథడ్ ఫాలో అవుతాను. కాకపోతే నారప్ప ఫాస్ట్ గానే అయిపొయింది గ్యాప్
రాదు అనుకున్నా. సరిగ్గా కరోన ఎఫెక్ట్ తగిలి డిలే అవుతూ వచ్చింది. ఇక దర్శకుడిగా నేను
గ్యాప్ తీసుకోలేదు వచ్చిందనే చెప్పాలి. త్రివిక్రమ్ గారి డైలాగ్ నా గ్యాప్ కి పర్ఫెక్ట్
ఆన్సర్.
నెక్స్ట్ సినిమా అదే
నెక్స్ట్ 'అన్నాయ్' అనే టైటిల్ తో సినిమా
చేయబోతున్నాను. అది మూడు భాగాలుగా రానుంది. మూడు పార్టులుగా చెప్పాల్సిన కథ అది. గీతా
ఆర్ట్స్ బేనర్ లో ఆ సినిమా చేయనున్నాను. హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ ఆ
కథ పెద్ద స్టార్ హీరోతోనే చేయాలనుంది. అదేవరనేది కొన్ని రోజుల్లు తెలియనుంది.
ఆ ప్రాజెక్ట్ స్క్రిప్టింగ్ లోనే ఉంది
కమల్ హాసన్ , వెంకటేష్ గారితో ఒక సినిమా
చేయాలనుంది. కథ రెడీ చేసుకుంటున్నాను. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్టింగ్ స్టేజిలోనే
ఉంది. త్వరలోనే ఆ సినిమా కూడా చేయాలనుంది.
Narappa Movie Review by Zee Cinemalu| Latest telugu news
నటీనటులు : విక్టరి వెంకటేష్, ప్రియమణి, కార్తిక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల, నరేన్ , ప్రభాకర్, రాఖి తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
సంగీతం: మణిశర్మ
కథ- స్క్రీన్ ప్లే : వెట్రిమారన్
నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్ , V క్రియేషన్స్
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్.
థాను
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిడివి : 153 నిమిషాలు
విడుదల తేది : 19 జులై 2021
విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప' థియేటర్స్
లో వస్తుందని ఊహించిన ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు నిర్మాతలు. సినిమా డైరెక్ట్ గా OTT
రిలీజ్ అనగానే ఇండస్ట్రీలో భారీ చర్చ నడిచింది. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో వెంకీ
ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. మరి ఇన్ని చర్చల నడుమ OTT లో రిలీజైన 'నారప్ప' ఆడియన్స్
ని మెప్పించిందా ? వెంకటేష్ ఈ రీమేక్ తో మరో విజయం అందుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్
క్లూజివ్ రివ్యూ.
అనంతపురంలోని ఓ పల్లెటూరిలో తన భార్య
సుందరమ్మ (ప్రియమణి) ముగ్గురు పిల్లలతో ఓ సాధారణ రైతు జీవితం గడుపుతుంటాడు నారప్ప
(వెంకటేష్). అనుకోకుండా నారప్ప పెద్ద కొడుకుతో ఆ ఊరి పెద్ద పండు స్వామి (నరేన్) పొలం
విషయంలో గొడవ పడతాడు. ఆ వివాదంతో ఊరి పెద్దపై నారప్ప పెద్ద కొడుకు ముణి కన్నా (కార్తీక్
జీవరత్నం) ఎదురుతిరుగుతాడు. తనపై ఎదురుతిరిగిన వెనకబడిన కులానికి చెందిన ముణి కన్నాని
తన మనుషులతో కిరాతకంగా హతమారుస్తాడు పండు స్వామి.
తన తల్లి బాధ చూడలేక అన్నయ్య ని చంపిన
పండు స్వామిని ఉద్వేగంతో చంపి తన పగ చల్లార్చుకుంటాడు సీనబ్బ(రాఖీ). హత్య కేసు నుండి
అలాగే పండుస్వామి మనుషుల నుండి కాపాడుకోవడం కోసం సీనబ్బని తీసుకొని ఊరికి దూరంగా అడవిలోకి
పారిపోతాడు నారప్ప. ఇంతకీ కొడుకుని చంపిన వారిపై నారప్ప ఎందుకు పగ తీర్చుకోలేదు..?
ఎందుకు సాత్వికంగా ఉంటాడు ? అతని గతమేంటి ? చివరికి నారప్ప పండుస్వామి హత్య కేసు నుండి
తన చిన్న కొడుకుని ఎలా కాపాడుకున్నాడు ? అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు :
రెండు డిఫరెంట్ లుక్స్ తో ఉండే క్యారెక్టర్
తో మెప్పించాడు వెంకటేష్. ముఖ్యంగా నారప్ప పాత్రలో ఒదిగిపోయి నటించాడు. గెటప్ నుండి
నటన వరకు ఎక్కడా వెంకీ కి వంక పెట్టడానికి
లేదు. సెంటిమెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా ఎప్పటిలాగే అలరించి సినిమాకు హైలైట్
గా నిలిచాడు. నారప్ప భార్య పాత్రలో ప్రియమణి సహజమైన నటనతో ఆకట్టుకుంది. ముణి కన్నా
క్యారెక్టర్ కి కార్తీక్ రత్నం పూర్తి న్యాయం చేశాడు. కార్తీక్ నటించిన కొన్ని సన్నివేశాలు
చూస్తే ఆ పాత్రకి సరైన నటుడిని ఎంచుకున్నారనిపిస్తుంది. ఈ సినిమాతో కార్తీక్ మరిన్ని
మంచి అవకాశాలు అందుకోవడం ఖాయం. అలాగే సీనబ్బ పాత్రలో నటించిన రాఖి మొదటి సినిమా అయినప్పటికీ
మంచి నటన కనబరిచాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అమ్ము అభిరామి తన నటనతో ఫరవాలేదనిపించుకుంది.
ఒరిజినల్ లో చేసిన పాత్రే కావడంతో నరేన్
మరోసారి తన పాత్రకు బలం చేకూర్చాడు. లాయర్ పాత్రలో రావు రమేష్, బసవయ్యగా రాజీవ్ కనకాల
మంచి నటన కనబరిచారు. శ్రితేజ, రామరాజు, వశిష్ట సింహా, దీపక్ శెట్టి, అరవింద్, కాదంబరి
కిరణ్, రచ్చరవి మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాకు సినిమాటోగ్రఫీ , నేపథ్య సంగీతం
ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ కి ఒరిజినల్ BGM వాడి ఇక్కడ కూడా అదే
ఇంపాక్ట్ తీసుకొచ్చారు. మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు పరవాలేదనిపించాయి తప్ప మళ్ళీ మళ్ళీ
వినేలా లేవు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.
యాక్షన్ ఎపిసోడ్స్ లో అతని ప్రతిభ కనిపించింది. గాంధి ఆర్ట్ వర్క్ బాగుంది. అప్పటి
కాలం లుక్ తీసుకొచ్చేలా వేసిన సెట్స్ ఎట్రాక్ట్ చేశాయి. ఎడిటింగ్ బాగుంది. పీటర్ హెయిన్స్,
విజయన్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకునేలా
ఉన్నాయి.
వెట్రి మారన్ కథ, స్క్రీన్ ప్లేతో దర్శకుడిగా
ఎలాంటి మార్పులు చేయకుండా నిజాయితిగా సినిమాను తీశాడు శ్రీకాంత్ అడ్డాల. తనలో ఫ్యామిలీ
డైరెక్టర్ మాత్రమే కాదు మంచి మాస్ దర్శకుడు కూడా ఉన్నాడని ఈ సినిమాతో రుజువు చేశాడు.
శ్రీకాంత్ అడ్డాల మాటలు ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
NARAPPA MOVIE REVIEW IN TELUGU
ZEECINEMALU
జీ సినిమాలు సమీక్ష :
రీమేక్ సినిమాను రెండు రకాలుగా తీయొచ్చు.
ఒకటి ఉన్నది ఉన్నట్టు మక్కీ కి మక్కీగా దించేయడం. ఇంకొకటి కాసిన్ని మార్పులతో రిస్క్
తీసుకొని తెరకెక్కించడం. నిజానికి రెండో మెథడ్ చాలా కష్టం. ఏ మాత్రం తేడా కొట్టినా
అక్కడ హిట్టయిన సినిమా ఇక్కడ ఫట్టు మంటుంది. అందుకే కొందరు దర్శక నిర్మాతలు రీమేక్
లో మార్పులు చేయడానికి సాహసించరు. అలాంటి రిస్క్ తీసుకోరు. 'నారప్ప' విషయంలో మొదటి
మెథడ్ నే ఫాలో అయ్యారు దర్శక నిర్మాతలు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ధనుష్
కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన 'అసురన్'ని ఎలాంటి మార్పులు చేయకుండా అంతే నిజాయితిగా
చెప్పే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు.
సినిమా మొదటి షాట్ నుండి లాస్ట్ ఫ్రేమ్
వరకు ఉన్నది ఉన్నట్టు తీశాడు శ్రీకాంత్ అడ్డాల. నిజానికి నటీనటుల నుండి అదే ఎమోషన్
రాబట్టి సేమ్ ఇంపాక్ట్ తీసుకురావడం కూడా కష్టమే. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి
శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడు. నిజానికి కొన్ని రీమేక్
సినిమాలు ఒరిజినల్ చూసిన ప్రేక్షకులకు అంతగా ఎక్కవు. ఎంత బాగా తీసినప్పటికీ ఏదో వెలితి
కనిపిస్తుంది. కానీ 'అసురన్' చూసిన ఆడియన్స్ కి కూడా 'నారప్ప' నచ్చేలా తెరకెక్కించాడు
శ్రీకాంత్ అడ్డాల. ఆ విషయంలో శ్రీకాంత్ ని మెచ్చుకోవాలి.
ఇక ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటించే
అతి కొద్ది మంది హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ అసురన్ రీమేక్ చేస్తున్నాడని
తెలియగానే కొన్ని కామెంట్స్ వచ్చాయి. కానీ వాటికి తన గెటప్ తో సగం సమాధానం ఇచ్చిన వెంకటేష్
ఇప్పుడు సినిమాలో తన నటనతో పూర్తి సమాధానం చెప్పాడు. చాలా ఏళ్ల తర్వాత నటనకి స్కోప్
ఉండే టెర్రిఫిక్ క్యారెక్టర్ దొరకడంతో నారప్ప గా రెచ్చిపోయాడు వెంకటేష్. వెంకీ నటన
సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచింది. అలాగే క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చే నటీనటులను
తీసుకోవడం కూడా సినిమాకి హెల్ప్ అయింది. ముఖ్యంగా ముని కన్నా పాత్రకు కార్తీక్ రత్నంని
సీనబ్బగా రాఖి ని ఎంపిక చేసుకోవడం బాగా కలిసొచ్చింది. ప్రియమణి కూడా క్యారెక్టర్ కి
ఫిట్ అయింది.
నిజానికి అణచివేత.. తిరుగుబాటుతో వెట్రిమారన్
రాసుకున్న ఈ కథ గతంలో మనం చూసిన సినిమాల్లో ఉన్నదే. ఇందులో కొత్తదనం ఏమి లేదు. కాకపోతే
కథలో కమర్షియల్ అంశాలు జోడించి అలాగే మంచి ఎమోషన్ మిక్స్ చేసి రాసుకున్న స్క్రీన్ ప్లే
వర్కౌట్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో చదువు గొప్పదనం గురించి చెప్పించి మంచి సందేశం
అందించాడు. అందుకే స్క్రీన్ ప్లేలో కూడా ఎలాంటి మార్పులు చేయకుండా వెట్రి మారన్ స్క్రీన్
ప్లేతోనే సినిమాను నడిపించాడు శ్రీకాంత్ అడ్డాల. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే మాత్రం
మంచితనం.. మంచోళ్ళు అంటూ ఫ్యామిలీ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాలే ఈ సినిమా తీసాడా?
అనే అనుమానం కలగక మానదు.ఈ సినిమాతో దర్శకుడిగా మాస్ యాక్షన్ కథలను కూడా డీల్ చేయగలనని
నిరూపించుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. కాకపోతే తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించింది.
వెంకటేష్ తో పాటు మన తెలుగు నటీ నటులు వరకూ ఓకె కానీ మిగతా క్యారెక్టర్స్ కి కూడా తెలుగు
నటీ నటులను తీసుకోవాల్సింది. ఫైనల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా
అన్నీ మిక్సయిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన నారప్ప అందరినీ ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
వెంకటేష్ నటన
క్యారెక్టర్స్
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
యాక్షన్ ఎపిసోడ్స్
సంభాషణలు
మైనస్ పాయింట్స్
స్లో నరేషన్
ఫ్లాష్ బ్యాక్ లవ్ ట్రాక్
సాంగ్స్
బాటమ్ లైన్ : సేమ్ ఇంపాక్ట్ అప్ప
రేటింగ్ : 3 /5
Sunday, July 18, 2021
Pawan’s Vakeel Saab World Television Premiere Today Only On Zee Telugu | Zee Cinemalu Latest News
ఇప్పటికే థియేటర్లలో దుమ్ముదులిపాడు వకీల్ సాబ్. ఈ సినిమా రాకతో అప్పటివరకు స్తబ్దుగా ఉన్న స్క్రీన్స్ అన్నీ కళకళలాడాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ కావడంతో అతడి ఫ్యాన్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కట్టారు.
అలా థియేటర్లలో హంగామా చేసిన వకీల్ సాబ్
సినిమా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా సందడి చేయబోతోంది. జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్
టెలివిజన్ ప్రీమియర్ గా గ్రాండ్ గా టెలికాస్ట్ కాబోతోంది. ఈరోజు (జులై 18, ఆదివారం)
సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగు ఛానెల్ లో వకీల్ సాబ్ సునామీ స్టార్ట్ అవుతుంది.
పవర్ ఫుల్ వకీల్ సాబ్ గా పవన్ కల్యాణ్
నటించిన ఈ సినిమాలో స్పెషాలిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడియన్స్
అందరికీ వకీల్ సాబ్ ఎట్రాక్షన్స్ తెలుసు. పవన్ కల్యాణ్ ఎప్పీయరెన్స్, యాక్షన్, మేనరిజమ్స్
మొదటి ఎలిమెంట్ అయితే.. ముద్దుగుమ్మలు నివేత థామస్, అంజలి, అనన్య నాగళ్ల పెర్ఫార్మెన్స్
మరో ఎలిమెంట్.
ఇక ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన పాటలతో, ఆర్ఆర్ తో సినిమాను
నెక్ట్స్ లెవెల్ లో నిలబెట్టాడు తమన్. వేణుశ్రీరామ్ డైరక్షన్ లో దిల్ రాజు బ్యానర్
పై వచ్చిన ఈ మెగా మూవీ.. ఇప్పుడు జీ తెలుగు ఆడియన్స్ కోసం ఎక్స్ క్లూజివ్ గా రెడీ అయింది.
ఈరోజు (18వ తేదీ) సాయంత్రం 6 గంటలకు జీ ఇప్పుడు జీ తెలుగు ఆడియన్స్ కోసం ఎక్స్ క్లూజివ్
గా రెడీ అయింది. తెలుగులో ఈ సినిమా టెలికాస్ట్ కాబోతోంది. సో.. మరో పవర్ ప్యాక్డ్ హంగామాకు
రెడీగా ఉండండి.
Vishal-Aarya’s Multistarrer Enemy Movie Shoot Completed| Zee Cinemalu Latest News
Action Hero Vishal, Manly Star Aarya starrer Latest Action Entertainer is 'Enemy'. Earlier Tamil Star Heroes Vishal and Aarya acted together in Bala Directorial ‘Vaadu – Veedu’ 10 years ago which became a big success at the box-office. Now Vishal and Aarya Acting together again for Biggie 'Enemy'. This film marks the 30th film for Vishal and 32nd for Aarya. Anand Shanker is Directing this film in Vinod Kumar’s Production under the Mini Studios banner. Versatile Actor Prakash Raj is playing a pivotal role in this film. Gaddalakonda Ganesh fame Mirunalini Ravi is playing a heroine in this film. Vishal announced that the shoot of 'Enemy' has been completed. Vishal said, " It's a wrap for 'Enemy' shoot, all set for Teaser soon, so damn happy & elated to have worked with a lovely team. Thanks to Director Anand Shanker, Music Director Thaman, Cameraman RD Rajasekhar cast & crew, Thanks to my Producer Vinod for making this lovely project. Love you jammy, so happy we are again in a fab film together." Popular Cinematographer RD Rajasekhar is cranking the camera while Music Sensation Thaman is composing the music. 'Enemy' will simultaneously release in Telugu Tamil and other languages. Makers are planning to release the film as soon as possible by finishing post-production works quickly. Action Hero Vishal, Aarya, Mirunalini Ravi, Prakash Raj are playing the main roles. Directed By Anand Shanker Producer: Vinod Kumar Cinematography: R.D. Rajasekar Music: Thaman S.S. Art: T. Ramalingam Editor: Raymond Derrik Crasta Action: Ravi Varma
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/vishal-aaryas-multistarrer-enemy-movie-shoot-completed-192304/No Clarity On Venkatesh’s Upcoming Movie After F3| Zee Cinemalu Latest News
హీరోలంతా 2-3 సినిమాలు లైన్లో పెట్టారు. ఒక సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో 2 సినిమాలకు కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేస్తున్నారు. చివరికి మహేష్ బాబు లాంటి హీరో కూడా ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడంటే హీరోలంతా ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టైమ్ లో కూడా తాపీగా ఉన్నాడు వెంకటేష్. అవును.. వెంకీ చేతిలో ఎఫ్3 మినహా మరో సినిమా లేదు.
నారప్ప సినిమాను పూర్తిచేసి విడుదలకు
సిద్ధం చేశాడు వెంకీ. దీంతో పాటు దృశ్యం-2 సినిమాను కూడా పూర్తిచేశాడు. ఈ రెండు సినిమాలు
త్వరలోనే డైరక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇవి కాకుండా ఎఫ్3 సినిమాను కూడా
క్లైమాక్స్ కు తీసుకొచ్చాడు. అయితే ఎఫ్3 తర్వాత సినిమా ఏంటనేది మాత్రం చెప్పలేకపోతున్నాడు.
నిజానికి వెంకీ చేతిలో మరో 2 ప్రాజెక్టులు
పెండింగ్ లో ఉన్నాయి. తరుణ్ భాస్కర్ తో సినిమా చాన్నాళ్లుగా నలుగుతోంది. కానీ ఆ సినిమా
ఇంకా ఫైనలైజ్ కాలేదని క్లారిటీ ఇచ్చాడు వెంకటేష్. ఇక త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాకు
ఇంకా చాలా టైమ్ ఉందంటూ రియాక్ట్ అయ్యాడు. సో.. ప్రస్తుతానికి ఎఫ్3 మినహా వెంకీ చేతిలో
మరో సినిమా లేదు.
అయితే లైనప్ విషయంలో విక్టరీని తక్కువ
అంచనా వేయడానికి వీల్లేదు. ఇలా సినిమా ఎనౌన్స్ చేసి అలా సెట్స్ పైకి తీసుకొచ్చి, అంతే
వేగంగా సినిమాల్ని పూర్తిచేస్తాడు ఈ సీనియర్ హీరో. కాబట్టి ఎఫ్3 పూర్తయ్యేలోపు వెంకటేశ్
నుంచి కొత్త సినిమాల ప్రకటన రావడం ఖాయం. మిగతా హీరోలకు పోటీ ఇవ్వడం అంతకంటే ఖాయం.
Saturday, July 10, 2021
Naga Shaurya’s LAKSHYA Climax Shoot Begins| Zee Cinemalu Latest News
Naga Shaurya’s 'LAKSHYA' Climax Shoot Begins Talented actor Naga Shaurya’s milestone 20th film ‘Lakshya’ is India’s first movie based on ancient archery. The sports drama directed by Dheerendra Santhossh Jagarlapudi promises to be entertaining and exciting. The movie shows Naga Shaurya in a never before look. Presented by Sonali Narang, Produced by NarayanaDas K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, And Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial role.
Crucial climax sequence of the film
is currently being shot in Hyderabad. Alongside Naga Shaurya, Jagapathi Babu
and few other actors are participating in the shoot. The climax portion is shot
lavishly, as it creates enough inquisitiveness as well as make a lasting
impression. The team has released a making video of the climax shoot and Naga
Shaurya can be seen gearing up to hit the bullseye. In fact, the sport archery
requires a keen eye, discipline and top-notch concentration.
was released on Naga Shaurya’s birthday showed glimpses of the flick which
received thumping response and other promotional content too hiked
expectations. Cast: Naga Shaurya, Ketika Sharma, Jagapathi Babu, Sachin
Khedekar etc. Technical Crew: Story, Screenplay, Direction: Dheerendra
Santhossh Jagarlapudi Producers: Narang Das K Narang, Puskur Ram Mohan Rao,
Sharrath Marar Cinematographer: Raam Reddy Music Director: Kaalabhairava
Editor: Junaid Siddiqui Dialogues : Srujanamani PRO: Vamsi-Shekar, BA Raju
Nithiin Merlapaka Gandhi Maestro Music Fest Begins Soon| Zee Cinemalu Latest News
Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Music Fest Begins Next Week Versatile hero Nithiin and director Merlapaka Gandhi have teamed up for the first time for a black comedy crime thriller Maestro which marks landmark 30th film for the actor. The film’s shooting part was wrapped up recently and the makers have now announced to begin music fest from next week. Nithiin can be seen playing piano at a beach in the announcement poster. We can expect another chartbuster album from composer Mahati Swara Sagar who previously provided chartbuster album for Nithiin’s Bheeshma. Nabha Natesh has paired opposite Nithiin, while Tamannaah Bhatia will be seen in a crucial role. The film’s first look poster and teaser that were released for Nithiin’s birthday got overwhelming response. N Sudhakar Reddy and Nikitha Reddy are producing the film under Shreshth Movies Banner, while Rajkumar Akella is presenting it. The film has cinematography by J Yuvraj. Maestro is in last leg of post-production works and the film is set for release soon. Cast: Nithin, Nabha Natesh, Tamannaah, Naresh, Jishhusen Gupta, Sreemukhi, Ananya, Harshavardhan, Rachha Ravi, Mangli, Srinivas Reddy Technical Crew: Dialogues, Direction: Merlapaka Gandhi Producers: N Sudhakar Reddy, Nikitha Reddy Banner: Sreshth Movies Presents: Rajkumar Akella Music Director: Mahati Swara Sagar DOP: J Yuvraj Editor: SR Shekhar Art Director: Sahi Suresh PRO: Vamsi-Shekar
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/nithiin-merlapaka-gandhi-maestro-music-fest-begins-soon-192032/Wednesday, July 7, 2021
Deep Discussions On Nani’s Tuck Jagadish Release Date| Zee Cinemalu Latest News
రిలీజ్ వరకు వచ్చి పోస్ట్ పోన్ అయిన సినిమాల్లో నాని 'టక్ జగదీష్' ఒకటి. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోన సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతుండటంతో త్వరలోనే థియేటర్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మేకర్స్ ఆగస్ట్ లో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఆగస్ట్ రెండో వారం లేదా మూడో వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
ప్రస్తుతం మేకర్స్ మీటింగ్ పెట్టుకొని
ఒక డేట్ ఫైనల్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఈ వారంలోనే సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్
డేట్ ప్రకటించే అవకాశం ఉంది. నాని సినిమా తర్వాత మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ తెలియాల్సి
ఉంది.
తెలంగాణ, ఆంధ్రలో థియేటర్స్ రీ ఓపెన్
కి పర్మీషణ్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఒక్కో సినిమా ఎనౌన్స్ మెంట్ వదిలే ప్లాన్ లో
ఉన్నారు నిర్మాతలు. ఏదేమైనా ఆగస్ట్ నుండి మళ్ళీ కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి
చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇక రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్లు, ప్రమోషన్స్ తో మళ్ళీ
టాలీవుడ్ కళకళలాడనుండి. అక్టోబర్ లో భారీ సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు రానున్నాయి.
Chiranjeevi Acharya Final Schedule Begins | Zee Cinemalu Latest News
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ కరోన కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు , ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ షూట్ ను ఈరోజు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని కోకాపేట్ లో వేసిన భారీ సెట్ లో ఫైనల్ షెడ్యుల్ మొదలైంది.
ముందుగా కొన్ని సన్నివేశాలు తెరకెక్కించి
2 రోజుల్ల సాంగ్ షూట్ చేసే పనిలో ఉన్నారు యూనిట్. ఈ సాంగ్ లో నటీనటులంతా కనిపిస్తారని
సమాచారం. చిరుతో కలిసి చరణ్, కాజల్, పూజా హెగ్డే ఇలా అందరూ ఉంటారట. ఆగస్ట్ లోపే టోటల్
షూట్ పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కరోన కారణంగా వాయిడా
పడుతూ వస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారు
మేకర్స్.
మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్, కొణిదెల
ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
త్వరలోనే ఆల్బం నుండి రెండో పాట విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ లాహే
లాహే కి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా నుండి రిలీజ్ కాబోయే రెండో సింగిల్
ఎలా ఉంటుందో అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. త్వరలోనే సినిమాకు సంబంధించి
కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఆచార్య థియేటర్స్
లోకి ఎప్పుదోచ్చేది తెలియనుంది.
Ram Krithi Shetty Lingusamy Movie Shooting Details | Zee Cinemalu Latest News
లింగుస్వామి దర్శకత్వంలో #RaPo19 సినిమా
చేయబోతున్నాడు రామ్. ఎనర్జిటిక్ స్టార్ కోసం మంచి మాస్ మసాలా సబ్జెక్ట్ రెడీ చేసి ఇటివలే
ఫైనల్ నెరేషన్ కూడా ఇచ్చాడు లింగుస్వామి. ఫైనల్ నెరేషన్ విన్నాక రామ్ తన ఎగ్జయిట్మెంట్
ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేస్తూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్
స్టేజిలో ఉన్న ఈ సినిమా ఈనెల 12 నుండి సెట్స్ పైకి వెళ్తుంది.
సినిమాలో రామ్ ఎనర్జీ ఓ రేంజ్ లో ఉంటుందని
, అలాగే లింగుస్వామి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సినిమాలో ఉంటాయని తెలుస్తుంది.
ఇస్మార్ట్ శంకర్ తో సరికొత్త లుక్ ట్రై చేసి మాస్ లో మంచి ఫాలోయింగ్ అందుకున్న రామ్
ఈ సినిమాలో కూడా ఓ కొత్త లుక్ ట్రై చేయనున్నాడని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ఒక లుక్ ఫైనల్
చేసి టెస్ట్ షూట్ కూడా చేశారట. మరి రామ్ ఇందులో ఎలాంటి లుక్ తో కనిపిస్తాడు ? తన క్యారెక్టర్
ఎలా ఉంటుంది ? అనే విషయాలు మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.
రామ్ సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
బుర్రా సాయి మాధవ్ ఈ సినిమాకు మాటలు అందించనున్నారు.
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/ram-krithi-shetty-lingusamy-movie-shooting-details-191816/
Tuesday, July 6, 2021
Allu Arjun Pushpa shoot resumes today in Hyderabad | Zee Cinemalu Latest News
లాంగ్ గ్యాప్ తర్వాత పుష్ప మూవీ మళ్లీ సెట్స్ పైకొచ్చింది. ఈరోజు ఉదయం ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. హీరో అల్లు అర్జున్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందంట.
బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న
పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పార్ట్-1కు సంబంధించిన
షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. ఈరోజు స్టార్ట్ అయిన షెడ్యూల్ లో, పార్ట్-1కు సంబంధించి
టోటల్ షూట్ పూర్తిచేయబోతున్నారు.
ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పుష్ప సినిమాకు
సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు అటు రష్మిక కాల్షీట్ల
ఎడ్జెస్ట్ మెంట్ కూడా ఈ ప్రాజెక్టుకు కష్టంగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో 2 సినిమాలు,
కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. ఎంత త్వరగా కాల్షీట్లు ఇస్తే అంత త్వరగా
పుష్ప షూట్ పూర్తవుతుంది.
మలయాళ స్టార్ యాక్టర్ ఫహాజ్ ఫాజిల్ ఈ
సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడికిదే తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్ ఉంది. ఆ పాటలో బన్నీతో
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ డాన్స్ చేయబోతోంది.
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/allu-arjun-pushpa-shoot-resumes-today-in-hyderabad-191752/
Thursday, July 1, 2021
Allu Arjun Kollywood Entry Almost Fix| Zee Cinemalu Latest News
అల్లు అర్జున్ కి ఎప్పటి నుండో తమిళ్ సినిమా చేసి కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలని ఉంది. కొన్నేళ్ళ క్రితం లింగుస్వామితో తెలుగు , తమిళ్ లో ఓ ప్రాజెక్ట్ అనుకొని చెన్నై వెళ్లి లాంచ్ లో కూడా పాల్గొన్నాడు బన్నీ. ఏవో కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. అక్కడి నుండి బన్నీ కోలీవుడ్ ఎంట్రీ ఆలస్యం అవుతూ వచ్చింది. 'పుష్ప' పాన్ ఇండియా సినిమాతో తమిళ్ లో పరిచయమవుతున్న అది డబ్బింగ్ సినిమా కిందకే వస్తుంది. అందుకే ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ కి బన్నీ ప్రిపైర్ అవుతున్నాడు.
మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ కోలీవుడ్
లో సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబో సినిమా ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా తమిళ నిర్మాత కలైపులి థాను నుండి అల్లు
అర్జున్ కి అడ్వాన్స్ అందిందని సమాచారం. సో బన్నీ బైలింగ్వెల్ సినిమాను ఆయనే నిర్మించే
ఛాన్స్ ఉంది. గీతా ఆర్ట్స్ కూడా ఇందులో భాగస్వామ్యం వహించే అవకాశం కనిపిస్తుంది.
ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్ తర్వాత
ఐకాన్ సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 కి సంబంధించి షూట్ ఫినిష్
చేస్తాడు. మరి ఈ గ్యాప్ లోనే మురుగదాస్ తో బన్నీ సినిమా ఉంటుందా ? లేదా పుష్ప పార్ట్
2 తర్వాత ఈ కాంబో సినిమా రానుందా ? తెలియాల్సి ఉంది. ఏదేమైనా తన కోలీవుడ్ ఎంట్రీ ఈసారి
పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు స్టైలిష్ స్టార్. త్వరలోనే ఈ సినిమాను ఎనౌన్స్ మెంట్
కి సన్నాహాలు చేస్తున్నారని టాక్.
A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today
ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...
-
ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...